Chicken: చికెన్ ప్రియులకు షాకింగ్ న్యూస్.. రాష్ట్రవ్యాప్తంగా మాంసం దుకాణాలు బంద్.. ఏప్రిల్ 1 నుంచి..
మాంసం ప్రియులకు షాకిచ్చే వార్త ఇది. చికెన్ షాపులు బంద్ కానున్నాయి. ఈ మేరకు బంద్ పాటించాలని చికెన్ షాప్స్ ఓనర్స్ అసోసియేషన్ ప్రకటించింది. పాల్ట్రీ కంపెనీలు మార్జిన్ తగ్గించడాన్ని వ్యతిరేకిస్తూ షాపుల నిర్వహకులు బంద్‌కు సిద్దమయ్యారు. ఇందులో భాగంగా షాపులను మూసివేసి నిరసన తెలపనున్నారు.

నాన్ వెజ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్. తెలంగాణలో ఏప్రిల్ 1వ తేదీ నుంచి చికెన్ షాపులు మూతపడనున్నాయి. పాల్ట్రీ కంపెనీలకు వ్యతిరేకంగా రాష్ట్ర చికెన్ షాప్ యజమానులు బంద్ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. పాల్ట్రీ యజమానులు మార్జిన్ తగ్గించడం వల్ల తమకు నష్టాలు వస్తున్నాయని చికెన్ షాపు నిర్వహకులు చెబుతున్నాయి. దీంతో పాల్ట్రీ కంపెనీలు దిగి వచ్చేంతవరకు షాపులు మూసివేసి బంద్ చేపట్టేందుకు సిద్దమయ్యారు. ఈ బంద్‌కు పలు చికెన్ షాప్స్ అసోసియేషన్స్ మద్దతు ప్రకటించాయి. ఏప్రిల్ 1 నుంచి బంద్ పాటించాలని పిలుపునిచ్చాయి. ఇప్పటికే హైదరాబాద్‌లో పలు చికెన్ షాపుల వద్ద దీనికి సంబంధించిన పోస్టర్లు వెలిశాయి. కస్టమర్లకు ముందస్తు సమాచారం అందించేందుకు చికెన్ షాపుల నిర్వహకులు ఈ పోస్టర్లను ఏర్పాటు చేశారు.
బంద్ కొనసాగిస్తాం
కొంతకాలంగా పాల్ట్రీ కంపెనీలు ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటున్నాయని చిచెన్ షాపుల యజమానులు చెబుతున్నారు. తమకు మార్జిన్ తగ్గించడం వల్ల షాపులను నడపడం కష్టంగా మారిందని, నష్టాలు వస్తున్నాయని ఆరోపిస్తున్నారు. చికెన్ విక్రయాలపై వచ్చే లాభాలు చాలా తక్కువగా ఉంటున్నాయని, దీంతో నడపడం కష్టంగా మారినట్లు చెబుతున్నారు. దీంతో మార్జిన్ పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. పాల్ట్రీ కంపెనీలు దిగి వచ్చి తమ డిమాండ్‌ను నెరవేర్చేంతవరకు బంద్ కొనసాగిస్తామంటూ తేల్చేశారు. తమకు ఇచ్చే మార్జిన్‌ను వెంటనే పెంచి న్యాయం చేయాలని కోరుతున్నారు. తమ సమస్య పరిష్కారం అయ్యేంతవరకు నిరసనలు కొనసాగిస్తామని, షాపులు బంద్ చేస్తామంటూ చికెన్ షాప్స్ ఓనర్ల అసోసియేషన్ ప్రకటించింది.
తగ్గిన చికెన్ ధరలు
ఇటీవల చికెన్ ధరలు భారీగా పెరిగాయి. ఏకంగా కిలో చికెన్ రూ.400కి చేరుకుంది. ప్రతీ ఏడాది సమ్మర్‌లో చికెన్ ధరలు పెరుగుతూ ఉంటాయి. ఎండ తీవ్రత వల్ల కోళ్లు చనిపోవడం వల్ల ఉత్పత్తి తగ్గుతుంది. దీని వల్ల ధరలు పెరుగుతూనే ఉంటాయి. అయితే ఈ సారి ఏకంగా కిలో చికెన్ రూ.400కి చేరుకోవడంలో మాంసం ప్రియులు షాక్ అవుతున్నారు. అయితే ప్రస్తుతం చికెన్ ధరలు కాస్త తగ్గాయి. మార్చి 29 తేదీన హైదరాబాద్‌లో కేజీ స్కిన్ లెస్ రూ.370కి లభిస్తోంది. ఇక అమలాపురంలో రూ.350కి దొరుకుతోంది.
