తరచుగా మిస్స‌వుతున్న‌ మేకలు… ఏంటా అని ఆరా తీయ‌గా.. కురుమూర్తి స్వామి గుట్ట స‌మీపంలో…

తెలంగాణ జిల్లాలు మరోమారు చిరుత సంచారంతో హడలెత్తిపోతున్నాయి. గత కొద్ది రోజులుగా కనిపించకుండా పోయిన చిరుత మళ్లీ పంజావిసురుతోంది.

తరచుగా మిస్స‌వుతున్న‌ మేకలు... ఏంటా అని ఆరా తీయ‌గా.. కురుమూర్తి స్వామి గుట్ట స‌మీపంలో...
Goats Missing
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 29, 2021 | 4:20 PM

తెలంగాణ జిల్లాలు మరోమారు చిరుత సంచారంతో హడలెత్తిపోతున్నాయి. గత కొద్ది రోజులుగా కనిపించకుండా పోయిన చిరుత మళ్లీ పంజావిసురుతోంది. తాజాగా మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం అమ్మా పురం గ్రామశివారులో చిరుత పులి సంచారం స్థానికుల్ని హడలెత్తిస్తోంది. కురుమూర్తి స్వామి గుట్టలో వరుసగా చిరుత పులి సంచారం గ్రామస్తులకు, రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది.

పేదల తిరుపతిగా పేరుగాంచిన శ్రీ కురుమూర్తి స్వామి గుట్టలో వారం రోజులుగా చిరుత సంచరించడం తో భక్తులు, గ్రామస్తులు, రైతులు భయభ్రాంతులకు గురవుతున్నారు. అమ్మాపురం, దుప్పల్లి గ్రామాలకు చెందిన గొర్రెల కాపర్లు కురుమూర్తి స్వామి గుట్ట సమీపంలో గొర్రెలను మేపడానికి వెళ్తుంటారు. ఈ క్రమంలోనే తరచుగా మేకలు కనిపించకుండా పోతుండటం.. ఒక్కసారిగా చిరుత కనిపించడంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. చిరుతపులే మేకల్ని తిని ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు గొర్రెల కాపరులు. కురుమూర్తి స్వామి మెట్ల దారి ఆంజనేయ స్వామి టెంపుల్ వెనకాల గుట్టపై చిరుత కనిపించడంతో స్థానికులు సెల్‌ఫోన్లలో ఫోటోలు తీసి వాట్సాప్‌ గ్రూపుల్లో షేర్‌ చేయటంతో జిల్లావాసులు వణికిపోతున్నారు.

ఏది ఏమైనా, పవిత్రమైన కురుమూర్తి స్వామి దర్శనానికి వెళ్లాలన్నా, చుట్టుపక్కల గ్రామస్తులు రైతులు పొలాలకు వెళ్లాలన్నా, ప్రజలు ఇంటి నుంచి బయటకు రావాలన్నా చిరుత సంచారంతో భయపడుతున్నారు. ఫారెస్ట్ అధికారులు స్పందించి చిరుతను బంధించి తీసుకెళ్లాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Also Read:  మరోమారు లాక్‌డౌన్‌పై స్పష్టతనిచ్చిన ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌

నిజామాబాద్‌ జిల్లాలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు ఊహించని షాక్‌.. చేప‌ల కోసం వ‌ల వేస్తే..