AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి శుభాకాంక్షల వెల్లువ.. ట్విట్టర్‌లో విషెస్ చెప్పిన చంద్రబాబు, పవన్

తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎల్‎బీ స్టేడియంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక గాంధీలతో పాటు కేసీ వేణుగోపాల్, ఛత్తీస్‎గఢ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖ్, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇతర నేతలు ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు.

Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి శుభాకాంక్షల వెల్లువ.. ట్విట్టర్‌లో విషెస్ చెప్పిన చంద్రబాబు, పవన్
Chandrababu And Pawan Kalyan Congratulat Revanth Reddy Swearing In As Telangana Chief Minister
Srikar T
|

Updated on: Dec 07, 2023 | 5:45 PM

Share

తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎల్‎బీ స్టేడియంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక గాంధీలతో పాటు కేసీ వేణుగోపాల్, ఛత్తీస్‎గఢ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖ్, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇతర నేతలు ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణస్వీకారం చేయగా.. తదుపరి గెలిచిన ఎమ్మెల్యేలలో 11 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి తాను రాష్ట్ర ప్రజలకు ఎలాంటి పాలన అందిస్తానో వివరించారు. అలాగే తొలి సంతకం ఆరు గ్యారెంటీలపై చేయగా.. రెండవ సంతకం వికలాంగ మహిళ రజినీకి ఉద్యోగాన్ని ఇస్తూ ఉద్యోగ నియమక పత్రం‎పై రెండో సంతకం చేశారు.

రేవంత్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు తమ శుభాకంక్షలు తెలియజేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు. ,తన పాలనలో ప్రజలకు మంచి చేకూరాలని, తన ముఖ్యమంత్రి పదవిని విజయవంతంగా కొనసాగించాలనే’ సందేశాన్ని జోడించారు.

ఇవి కూడా చదవండి

అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. రేవంత్ రెడ్డితో తనకు వ్యక్తిగతంగా స్నేహం ఉందన్నారు. తెలంగాణలో యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తూ నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఆయన పాల్గొని తమ పార్టీ అభిప్రాయాన్ని సూటిగా వెల్లడించారు. వాగ్ధాటి, ప్రజాకర్షణ కలిగిన ఆయన రాజకీయంగా ఎన్నో ఒత్తిళ్లను ఎదుర్కొంటూ పోరాటాలు చేసి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు’ అని ట్వీట్ చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..