AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bjp vs Trs: ముఖ్యమంత్రికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. ఇలాంటి పరిస్థితి కొత్తగా చూస్తున్నామంటూ..

Bjp vs Trs: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హుజూరాబాద్ ఫలితాల నుంచి సీఎం కేసీఆర్‌ తీరులో మార్పు వచ్చిందన్నారు.

Bjp vs Trs: ముఖ్యమంత్రికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. ఇలాంటి పరిస్థితి కొత్తగా చూస్తున్నామంటూ..
Shiva Prajapati
|

Updated on: Feb 15, 2022 | 2:05 PM

Share

Bjp vs Trs: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హుజూరాబాద్ ఫలితాల నుంచి సీఎం కేసీఆర్‌ తీరులో మార్పు వచ్చిందన్నారు. మంగళవారం నాడు మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి.. తెలంగాణ సమాజం కేసీఆర్ ముందు బానిసల్లా ఉండాలని కోరుకుంటున్నారని ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి మాటలు తీసుకున్న అంశాలు దిగజారుడు – దివాలాకోరు విధంగా ఉన్నాయన్నారు. ముఖ్యమంత్రే హింసకు- దాడులకు దిగడం కొత్తగా చూస్తున్నామన్నారు. బడ్జెట్, కేంద్రం, మోడీపై సీఎం కేసీఆర్ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. కేసీఆర్ మాట్లాడే మాటలు పాకిస్తాన్ దేశం కూడా మాట్లాడదని అన్నారు. బీజేపీకి ఎవరూ శత్రువులు కాదని, కేవలం ప్రత్యర్ధులు మాత్రమే అని పేర్కొన్నారు. బీజేపీకి ఉన్న ఏకైక శత్రువు పాకిస్తాన్ మాత్రమే అని వ్యాఖ్యానించారు.

సైనికుల కుటుంబాల మనోభావాలు బెద్దతిసే విధంగా సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు ఉన్నాయని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. దాడికి గురైన ఉగ్రవాద సంస్థలే దాడి జరిగినట్లు అంగీకరించాయన్నారు. సర్జికల్ స్ట్రైక్ పై బీజేపీకి కేసీఆర్ సర్టిఫికెట్ అవసరం లేదని, ప్రపంచం అంతా చూసిందన్నారు. పాకిస్తాన్‌లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన యుద్ధ వీరుడు అభినందన్ పట్టుపడితే 24 గంటల్లో ఇండియాకు రప్పించామన్నారు.

ఇదే సమయంలో విద్యుత్ సంస్కరణలపై ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన కామెంట్స్‌పై తీవ్రంగా స్పందించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఫ్రీ కరెంట్ రైతులకే కాదు.. అన్ని వర్గాల వారికి ఫ్రీ గా ఇచ్చినా బీజేపీకి ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. మోటర్లకు మీటర్లు పెట్టాలని ఏ రాష్ట్రానికి కేంద్రం ఆదేశాలు ఇవ్వలేదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. మోటర్లకు మీటర్లు పెట్టాలనే ఆలోచన కేంద్రానికి లేదన్నారు. యూరియపై వందశాతం సబ్సిడీ కేంద్రమే ఇస్తోందన్నారు. త్వరలో తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన ఉంటుందన్నారు. రామగుండంలో ఫ్యాక్టరీ స్థాపనలో పాల్గొంటారని చెప్పారు కేంద్ర మంత్రి. యూరియా సబ్సిడీ గత ఏడాది రూ. 79 వేల కోట్లు ఉంటే.. ఈ ఏడాది 1లక్ష కోట్లు పెట్టామని ప్రకటించారు. అంటే గతంతో పోల్చితే ఈ సారి 30శాతానికి పైగా సబ్సిడీ పెంచామని వివరించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.

Also read:

Viral Video: యమ ధర్మరాజే వదిలేశాడేమో.. క్షణ కాలంలో ప్రాణాలు సేఫ్.. వీడియో చూస్తే గుండె జల్లుమనడం ఖాయం..!

Viral Video: మాంచి ఆకలి మీదున్న పక్షి.. జింకను అత్యంత క్రూరంగా వేటాడేసింది.. షాకింగ్ వీడియో మీకోసం..

Manuguru Municipality: కమిషనర్‌ కుర్చీ కోసం పొట్టు పొట్టుగా కొట్టుకున్న అధికారులు.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన కలెక్టర్..