AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తెలంగాణ ఎన్నికలపై కేంద్ర ఎలక్షన్‌ కమిషన్‌ స్పెషల్‌ నజర్‌.. ఎందుకంటే..

తెలంగాణ దంగల్‌కి ఇంకా 23 రోజులే మిగిలి ఉండడంతో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తెలంగాణపై సీరియస్‌గా దృష్టి సారించింది.ఒక వైపు నామినేషన్‌ల పర్వం కొనసాగుతుండగానే ఇంకో వైపు రాజకీయ పార్టీలు ప్రచార హీట్ పెంచాయి. దీంతో దబ్బు మధ్యం సరఫరాపై ప్రత్యెక నిఘా ఉంచింది ఈసీ. ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన నాటి నుంచి తాజాగా దాదాపు రూ. ఐదు వందల కోట్లకు పైగా విలువగల సొమ్మును సీజ్ చేశారంటేనే...

Telangana: తెలంగాణ ఎన్నికలపై కేంద్ర ఎలక్షన్‌ కమిషన్‌ స్పెషల్‌ నజర్‌.. ఎందుకంటే..
Telangana Elections 2023
Yellender Reddy Ramasagram
| Edited By: Narender Vaitla|

Updated on: Nov 07, 2023 | 8:52 PM

Share

తెలంగాణ ఎన్నికల పైన సెంట్రల్ ఎలక్షన్‌ కమిషన్‌ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఎన్నికలు జరుగుతున్న మిగతా 4రాష్ట్రాల కంటే తెలంగాణలో భిన్న పరిస్థితులు ఉండడంతో ప్రత్యేక కార్యాచరణ రెడీ చేస్తోంది. మానిటరింగ్ సెల్ ద్వారా నామినేషన్ ప్రక్రియతో పాటు రాజకీయ పార్టీల ప్రచారాలపై నిఘా పెట్టింది.

తెలంగాణ దంగల్‌కి ఇంకా 23 రోజులే మిగిలి ఉండడంతో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తెలంగాణపై సీరియస్‌గా దృష్టి సారించింది.ఒక వైపు నామినేషన్‌ల పర్వం కొనసాగుతుండగానే ఇంకో వైపు రాజకీయ పార్టీలు ప్రచార హీట్ పెంచాయి. దీంతో దబ్బు మధ్యం సరఫరాపై ప్రత్యెక నిఘా ఉంచింది ఈసీ. ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన నాటి నుంచి తాజాగా దాదాపు రూ. ఐదు వందల కోట్లకు పైగా విలువగల సొమ్మును సీజ్ చేశారంటేనే తెలంగాణలోఎన్నికలు ఏ రేంజ్‌లో ఖరీదైనవిగా మారాయో అర్థం చేసుకోవచ్చు. ఇటు అయా రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు పరస్పరం ఫిర్యాదులు చేసుకోవడంతో అన్ని పార్టీల అభ్యర్థులపై నజర్ పెట్టింది.

ఇది ఇలా ఉంటే.. ప్రతీ రెండు రోజులకు ఒకసారి ఈసి ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశాలు ఎర్పాటు చేస్తోంది. 60మంది ఐఆర్‌ఎస్‌ అధికారులను వ్యయ పరిశీలకులుగా నియమించింది సీఈసీ. ఆయా జిల్లల్లోని రాజకీయ పార్టీలు అభ్యర్థి పైనా ఎంత మేరకు ఖర్చు పెట్టారు. ఖర్చు పెట్టిన వివరాలు, డిజిటల్ పేమెంట్స్‌ తదితర అంశాలపై వివరాలు సేకరిస్తూ హెడ్ క్వాటర్ నుంచి మానిటరింగ్ చేస్తుంది. 39మంది ఐపీఎస్‌ అధికారులను పోలీసు పరిశీలకులుగా నియమించి. ఎవరెవరు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నరన్న అంశం పై వివరాలు సేకరిస్తూ నేరుగా సెంట్రల్ ఈసికి రిపోర్టు ఇస్తోంది. ఇప్పటికే వివిధ శాఖల్లో భారీగా బదిలీలు చేపట్టిన ఈసీ.. కలెక్టర్లు, ఎస్పీలు, అబ్జర్వర్స్ పైన ప్రత్యెక టీంను నియమించి ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకుంటోంది.

అదే విధంగా సోషల్ మీడియాపై స్పెషల్ ఫోకస్ పెట్టింది ఈసీ. ఇందుకోసం ప్రత్యేక వింగ్ ఏర్పాటు చేశారు. అన్ని రాజకీయ ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ పై నిఘా పెట్టింది. గూగుల్, ఫేస్‌బుక్‌, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు సంస్థలతో చర్చలు జరిపి ఎన్నికల నియమావలికి లోబడి ఉండాలని కోరింది ఈసీ. ఎన్నికల కోడ్ ఉల్లంఘించేలా, నిబంధనలకు విరుద్దంగా ఓటర్లను ప్రలోభపెట్టేలా, ఇతర వర్గాలను కించపర్చేలా చేసే పోస్టింగ్‌లపై వివిధ వెబ్‌సైట్‌ ద్వారా స్కాన్ చేస్తూ చర్యలు తీసుకుంటుంది. తప్పుడు సమాచారం, ఎన్నికల ప్రచారం వంటి బల్క్ SMSలు చేసినా, రూమర్లను ప్రచారం చేసినా డేగ కన్నుతో వాచ్ చేస్తుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..