AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: పవన్‌ కళ్యాణ్‌ దగ్గరికి క్యూ కడుతోన్న తెలంగాణ బీజేపీ అభ్యర్థులు.. ఎందుకో తెలుసా.?

అయితే మంగళవారం బీజేపీ ఏర్పాటు చేసిన బీసీ ఆత్మ గౌరవ సభలో ఆసక్తి కర సన్నివేశం కనిపించింది. ఇప్పటికే బీజేపీ జనసేన పోత్తు కుదిరిన తరువాత ఏర్పాటు చేసిన సభలో పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు. సభ ఆరంభంలోనే ముఖ్య నాయకులతో పాటు పవన్ కళ్యణ్ ముందు గానే సభ స్థలికి చేరుకున్నారు. మోదీ రావడానికి కొంచం టైం పట్టడంతో వేదికపైన అందరు కూర్చున్నారు. అయితే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు...

Telangana: పవన్‌ కళ్యాణ్‌ దగ్గరికి క్యూ కడుతోన్న తెలంగాణ బీజేపీ అభ్యర్థులు.. ఎందుకో తెలుసా.?
Pawan Kalyan
Ashok Bheemanapalli
| Edited By: Narender Vaitla|

Updated on: Nov 07, 2023 | 8:19 PM

Share

ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ పోటీ చేసే అభ్యర్థులు తమకు దొరికిన ప్రతి విషయాన్నీ ప్రచార అస్త్రాలుగా మలుచుకుంటున్నారు. నామినేషన్ల ప్రకీయ కొనసాగుతూనే ఉంది. ప్రచారానికి సమయం కూడా చాలా తక్కువ ఉండడంతో అందుకు అనుగుణంగా ప్లాన్ చేసుకుంటున్నారు నియోజక వర్గ అభ్యర్థులు. ఈ క్రమంలోనే అధికార పార్టీ బీఆర్‌ఎస్‌ ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతోంది.

డప్పు స్టెప్పులు చేస్తూ.. రిధమిక్‌గా డైలాగ్‌లు చెప్తూ ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఈ డైలాగ్‌లో ట్రెండ్‌ అవుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్‌లో వైపు టికెట్ల పంచాయతీ నడుస్తున్నా, తన దైన స్టైల్‌లో ముందుకుపోతోంది. అధికార పక్షంపై షార్ట్ ఫిలిమ్స్ తీస్తూ 6గ్యారెంటిల పథకాలు వివరిస్తూ ప్రచారంలో దూసుకు పోతున్నారు. అయితే బీజేపీ ఇప్పటి వరకు చెప్పుకొదగ్గ ప్రచారం మొదలు పెట్టలేదని చెప్పాలి.

అయితే మంగళవారం బీజేపీ ఏర్పాటు చేసిన బీసీ ఆత్మ గౌరవ సభలో ఆసక్తి కర సన్నివేశం కనిపించింది. ఇప్పటికే బీజేపీ జనసేన పోత్తు కుదిరిన తరువాత ఏర్పాటు చేసిన సభలో పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు. సభ ఆరంభంలోనే ముఖ్య నాయకులతో పాటు పవన్ కళ్యణ్ ముందు గానే సభ స్థలికి చేరుకున్నారు. మోదీ రావడానికి కొంచం టైం పట్టడంతో వేదికపైన అందరు కూర్చున్నారు. అయితే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఒక్కరోక్కరుగా జనసేన అధినేత దగ్గరికి వచ్చి, తమను తాము పరిచయం చేసుకున్నారు.

అంతే కాదు తాము ఏ ప్రాంతం నుంచి పోటీ చేయాలనుకుంటున్నారో చెప్తూ ప్రచారానికి మా ప్రాంతానికి రావాలని బలంగా కోరారు. ముఖ్యమంగా హైదరాబాద్ పరిసరప్రాంతాల్లో సెటిలర్స్ ఎక్కువగా ఉన్న ప్రాంతపు అభ్యర్థులు పవన్ కళ్యణ్ వచ్చి ప్రచారం చేయాలనీ కోరారు. పవన్‌ సైతం ఇందుకు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. సాధారణంగా ఎన్నికలు వచ్చినపుడు సినిమా స్టార్లు ప్రచారం చేయడం సర్వసాధారణమైన విషయం. ఇక పవన్‌ కళ్యాణ్‌ లాంటి స్టార్‌ హీరో ప్రచారానికి వస్తే కచ్చితంగా తమకు మేలు జరుగుతుందని నాయకులు భావిస్తున్నారు. అందుకే ప్రచారానికి పవన్‌ను ఉపయోగించుకోవాలని తెలంగాణ బీజేపీ అభ్యర్థులు భావిస్తున్నారు. చూడాలి మరి పవన్‌ ప్రచారంలో పాల్గొంటారో లేదో.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..