Khammam: ప్రేమించడమే పాపం అయ్యింది.. ఖమ్మం జిల్లాలో అమానుష సంఘటన..

కులాలు వేరైనా తల్లిదండ్రులను ఒప్పించి యువతి, యువకుడు పెళ్లి చేసుకున్నారు. వారి ప్రేమ పెళ్లికి ఇరు కుటుంబాల నుంచి ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ

Khammam: ప్రేమించడమే పాపం అయ్యింది.. ఖమ్మం జిల్లాలో అమానుష సంఘటన..
Love Marriage
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 22, 2023 | 10:07 AM

ఖమ్మం జిల్లాలో ఓ అమానుష సంఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని మండాలపాడులో ఈ ఘటన జరిగింది.  కాలం మారుతోన్న కొందరు మాత్రం ఇంకా పాత కాలంలోనే ఉన్నారు.  ఓ ప్రేమ జంట కులాంతర వివాహం చేసుకుందని..వారిని కుల బహిష్కరణ చేశారు కులపెద్దలు.

కులాలు వేరైనా తల్లిదండ్రులను ఒప్పించి యువతి, యువకుడు పెళ్లి చేసుకున్నారు. వారి ప్రేమ పెళ్లికి ఇరు కుటుంబాల నుంచి ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ అమ్మాయికి సంబంధించిన కుల పెద్దలు..యువతి కుటుంబాన్ని వెలేశారు. కులాంతర వివాహం చేసుకున్నందుకు 20వేల జరిమానా విధించారు. అంతేకాదు. వారితో ఎవరు మాట్లాడినా, శుభకార్యాలకు పిలిచినా ఫైన్‌ విధిస్తామని తీర్మానం చేశారు.

తమ కుటుంబాన్ని వెలేసిన కుల సంఘం పెద్దలపై పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధిత కుటుంబం. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.