Renuka Choudary: అందుకే ఎస్‌ఐ కాలర్ పట్టుకున్నా.. వివరణ ఇచ్చిన రేణుకా చౌదరి
ఆందోళనకు దిగిన కాంగ్రెస్ శ్రేణులను అదుపు చేసే క్రమంలో రేణుకాచౌదరి తన కాలర్ పట్టుకున్నారని పంజాగుట్ట ఎస్‌ఐ ఉపేంద్రబాబు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
మాజీ ఎంపీ, కాంగ్రెస్‌నేత రేణుకాచౌదరిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఎస్సై ఉపేంద్ర బాబు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన రాజ్‌భవన్ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసిన విషయం తెలిసిందే. ఆందోళనకు దిగిన కాంగ్రెస్ శ్రేణులను అదుపు చేసే క్రమంలో రేణుకాచౌదరి తన కాలర్ పట్టుకున్నారని పంజాగుట్ట ఎస్‌ఐ ఉపేంద్రబాబు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రాజ్‌భవన్ వద్ద ఆందోళనకారులను అరెస్టు చేసే క్రమంలో రేణుకాచౌదరిని కూడా అరెస్టు చేసిన పోలీసులు ఆమెను గోల్కొండ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
#WATCH | Telangana: Congress leader Renuka Chowdhury holds a Policeman by his collar while being taken away by other Police personnel during the party’s protest in Hyderabad over ED summons to Rahul Gandhi. pic.twitter.com/PBqU7769LE
ఇవి కూడా చదవండి— ANI (@ANI) June 16, 2022
అయితే తనకు పోలీసల పట్ల గౌరవం ఉందని అన్నారు. పంజాగుట్ట ఎస్‌ఐ ఉపేంద్ర బాబు ఆరోపణలపై రేణుకాచౌదరి స్పందించారు. ‘వెనుకాల నుంచి తనను తోసేశారు. అదుపుతప్పి కిందపడుతుండగా ఎస్‌ఐ భుజం పట్టుకున్నా.. ఎస్‌ఐని అవమానపర్చడం తన ఉద్దేశం కాదన్నారు. తన చుట్టూ మగ పోలీసులు ఎందుకున్నారని ప్రశ్నించారు. యూనిఫాంను ఎలా గౌరవించాలో తనకు తెలుసన్నారు. పోలీసుల పట్ల గౌరవం ఉందన్నారు. దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందన్నారు. కక్షసాధింపునకు దర్యాప్తు సంస్థలను కేంద్రం వినియోగిస్తోందని గోల్కొండ పోలీస్ స్టేషన్ వద్ద రేణుకా చౌదరి వెల్లడించారు.