Petrol Bunk Siege: బండికి పెట్రోల్ కొట్టించిన వ్యక్తి.. బంక్ దాటగానే మైండ్ బ్లాంక్
బంకు యాజమాన్యం అధికారులకు ఏ మాత్రం సహకరించలేదు. దాంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బంకును సీజ్ చేసినట్టు స్థానిక ఆర్ఐ వెల్లడించారు.
ఓ వైపు పెట్రోల్, డీజిల్ధరలు చుక్కలనంటుతున్నాయి. మరోవైపు..పెట్రోలు బంకుయాజమాన్యాలు చేస్తున్న కనికట్లతో సామాన్యుల రక్తాన్ని పీల్చేస్తున్నాయి. పరిమాణంలో తేడాలు, కొలతల్లో తేడాలు, చివరకు పెట్రోల్ డీజిల్లో నీళ్లు కలిపేస్తున్నారు.. తాజాగా ఇటువంటి ఘటనే మంచిర్యాల జిల్లా జన్నారంలో వెలుగు చూసింది. పెట్రోల్, డీజిల్ కు బదులు వాటర్ వస్తున్నట్లు వినియోగదారులు ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకులో ఆందోళన చేయడం తో రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ భానుచందర్ ఆధ్వర్యంలో బంకును సీజ్ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే…
మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకులో పెట్రోల్ డీజిల్ కు బదులు నీళ్లు వస్తున్నట్లు వినియోగదారులు ఆందోళనకు దిగారు. బంకు ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జన్నారం ఆర్ ఐ భానుచందర్ బంకును ప్రాథమిక పరిశీలించేందుకు వచ్చారు. దాంతో బంకు యాజమాన్యం అధికారులకు ఏ మాత్రం సహకరించలేదు. దాంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బంకును సీజ్ చేసినట్టు స్థానిక ఆర్ఐ వెల్లడించారు.
ఇండియన్ ఆయిల్ బంకులో ఎప్పుడూ మోసాలేనని గతంలో చాలా సార్లు నీళ్ళు రావడం, పెట్రోల్ మీటర్ రీడింగ్ లో లొపాలు రావడం సహజమేనని స్థానికులు మండిపడుతున్నారు. ఎన్ని సార్లు అధికారుల కు చెప్పినా పట్టించుకోలేదని అసలు ఈ బంకును మొత్తం సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆర్ఐ మాట్లాడుతూ వినియోగదారుల పిర్యాదు మేరకు బాంకు పరిశీలనకు రాగ యాజమాన్యం సహకరించకపోవడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బంకును తాత్కాలికంగా సీజ్ చేసినట్లు తెలిపారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి