Emergency Landing: ఇండిగో విమానం ఇంజిన్‌లో ప్రకంపనలు.. అక్కడే అత్యవసర ల్యాండింగ్‌..?

ఈ విషయాన్ని ఇండిగో అధికార ప్రతినిధి నిర్ధారించారు. విమానం ఇంజిన్‌లో ప్రకంపనలు రేగడంతో అత్యవసరంగా ఇండిగో విమానం 6E-859ను..

Emergency Landing: ఇండిగో విమానం ఇంజిన్‌లో ప్రకంపనలు.. అక్కడే అత్యవసర ల్యాండింగ్‌..?
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 15, 2022 | 1:04 PM

Emergency Landing: ప్రయాణికులతో గాల్లో ఎగురుతున్న ఇండిగో విమానం ఇంజిన్‌లో ప్రకంపనలు కలకలం రేపాయి. విమానం ఇంజిన్ లో క్ష‌ణ‌కాలంపాటు ప్ర‌కంప‌న‌లు రావ‌డంతో అత్య‌వ‌స‌రంగా విమానాన్ని ల్యాండ్‌ చేశారు సిబ్బంది. ఈ ఘటన ఢిల్లీ నుంచి వడోదర వెళ్తున్న ఇండిగో విమానంలో జరిగింది. దాంతో జైపూర్ లో ఇండిగో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు.. ఢిల్లీ నుంచి వడోదర వెళ్తున్న ఇండిగో విమానం ఇంజిన్‌లో క్షణకాలంపాటు ప్రకంపనలు వ‌చ్చాయి. అనంతరం అందులోని ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చేందుకు ప్రత్యామ్నాయ విమనాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్టు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) తెలిపింది.

ఈ విషయాన్ని ఇండిగో అధికార ప్రతినిధి నిర్ధారించారు. విమానం ఇంజిన్‌లో ప్రకంపనలు రేగడంతో అత్యవసరంగా ఇండిగో విమానం 6E-859ను జైపూర్ మళ్లించినట్టు తెలిపారు. మార్గమధ్యంలోనే పైలట్‌కు హెచ్చరిక సందేశం అందిందని, దీంతో ముందుజాగ్రత్త చర్యగా తదుపరి తనిఖీల కోసం విమానాన్ని పైలట్ జైపూర్‌కు మళ్లించాడని ఆయన పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి