AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీరు తింటుంది కమ్మని మామిడి పండ్లు కాదు.. కాలకూట విషం! ఎలా అంటే..

జగిత్యాల, కరీంనగర్ మామిడి మార్కెట్లలో కాల్షియం కార్బైడ్‌తో మామిడి పండ్లను కృత్రిమంగా పక్వానికి తీసుకురావడం వల్ల ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. హైకోర్టు ఇప్పటికే ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేసింది. కానీ, అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదకరమైన పద్ధతి ఇంకా కొనసాగుతోంది.

మీరు తింటుంది కమ్మని మామిడి పండ్లు కాదు.. కాలకూట విషం! ఎలా అంటే..
Mangos
G Sampath Kumar
| Edited By: |

Updated on: May 04, 2025 | 7:10 PM

Share

ఉదయం ఆకుపచ్చ రంగులో ఉన్న కాయ.. సాయంత్రానికే పసుపుపచ్చ కలర్ పులుముకుని పండవుతుంది. ఏ మంత్రదండముంటేనో సాధ్యపడే ప్రక్రియే కాదది. జస్ట్ క్యాల్షియం కార్బైడ్ ఉంటే చాలు. చూడ్డానికీ రంగు వావ్ అనిపించేలా ఉన్నా.. తింటే మాత్రం రుచిపచీ ఉండదు. పైగా అదో విషతుల్యం. మనల్ని ఊరించే మామిడిపండు కోసం మనమే డబ్బులిచ్చి విషాన్ని కొనుక్కోవడమన్నమాట. విషంగా మారుతున్న మామిడి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

మామిడి మార్కెట్ లు అంటే ఎక్స్పోర్ట్ క్వాలిటీ అని పేరు పడింది. కానీ, అదే సమయంలో ఆ పండ్లు తింటే అద్భుతమైన రుచి, ఆస్వాదేనమోగానీ.. నయం కాని రోగాల బారిన పడటం ఖాయమనే పేరునూ మూటగట్టుకుంటోంది ఈ మార్కెట్. జగిత్యాల, కరీంనగర్ మార్కెట్ లో ప్రతీ ఏడూ సుమారు 70 నుంచి 80 కోట్ల రూపాయల టర్నోవర్ తో బిజినెస్ జరుగుతుంది. 35 వేల నుంచి 45 వేల టన్నుల మామిడి ఈ మార్కెట్ కు చుట్టుపక్కల తోటల నుంచి తరలివస్తుంది. అయితే, ఈ మార్కెట్ స్థానికుల చేతుల్లోంచి.. ఏకంగా ఇతర రాష్ట్రాలవారి చేతుల్లోకి వెళ్లిపోయింది. ఇక్కడి నుంచి ఉత్తరాదికి ముఖ్యంగా ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, పంజాబ్, మహారాష్ట్ర వంటి పలు రాష్ట్రాలకు మామిడిపండ్లను ఎగుమతి చేస్తారు. అయితే, ఆ మామిడి పళ్లల్లో కార్బైడ్ కలపడం వివాదాస్పదంగా మారుతోంది. హైకోర్ట్ కూడా మామిడి పండ్లను మాగబెట్టే విషయంలో కార్బైడ్ వాడకంపైనా.. పర్యవేక్షించాల్సిన ఫుడ్ ఇన్స్పెక్టర్స్ లేకపోవడంపైనా ప్రభుత్వంపై సీరియస్ అయింది.

మామిడి మార్కెట్ లో మనకు అక్కడక్కడా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అప్రూవల్ అయిన ఇథలీన్ రీపెనర్ కవర్స్ దర్శనమిస్తాయి. ఈ ప్యాకెట్స్ లో పౌడర్ ద్వారానో.. లేక, గ్యాస్ పద్ధతిలోనో మాగబెట్టడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కానీ, ఈ ప్యాకెట్స్ మనకు మార్కెట్ లో కనిపిస్తున్నా… లోలోపల వాడేది మాత్రం కాల్షియం కార్బైడే. ఎప్పుడైతే ఒక ప్యాకెట్ ను నీళ్లల్లో ముంచుతున్నారో అది ఇథలీన్ రీపెనర్ కాదన్నట్టు. అయితే, జరుగుతున్న ఈ లోగుట్టును పట్టించుకునే అధికారులు లేక ఇక్కడ విషం నింపిన మామిడి పండ్లు ఎగుమతవుతూ, మార్కెట్ లోకి పోటెత్తుతున్నాయి. కాల్షియం కార్బైడ్ ఎంత విషమంటే.. సరిగ్గా హిమాచల్ ప్రదేశో, ఢిల్లీకో వెళ్లేందుకు సిద్ధం చేసే కాటన్ లో వీటిని వేసి పెడతారు. ఒకవేళ అవి సమయానికి రీచ్ కాక.. ఓ రెండురోజులు ఆలస్యమైతే ఆ పండ్లన్నీ పనికిరానంతగా కుళ్లిపోతాయి.

అలాంటిది ఆ కార్బైడ్ వేసిన నీళ్లల్లో వేసి మాగబెట్టిన పండ్లు తింటే ఎలాంటి రోగాలు వస్తాయో అర్థం చేసుకోవచ్చు. ఈ విషయంపై కొందరు సామాజిక కార్యకర్తలు ఇప్పటికీ ఫైట్ చేస్తుండగా.. మరోవైపు వైద్యులు కాల్షియం కార్బైడ్ వల్ల క్యాన్సర్ వంటి రోగాలు రావడంతో పాటు.. కిడ్నీలపైనా ఎఫెక్ట్ చూపిస్తుందంటున్నారు. కార్బైడ్ విషంతో మామిడిని మాగబెట్టే ఫల ప్రక్రియపై హైకోర్ట్ 2015లోనే సీరియస్ అయింది. ఫుడ్ సేఫ్టీ అధికారులను నియమించాలని అక్షింతలు వేసింది. అయినా, పరిస్థితులు మారలేదు సరికదా.. ఇప్పుడైతే ఆ ఫుడ్ సేఫ్టీ అధికారుల జాడ పత్తానే లేకుండా పోయింది. ఆర్గానిక్ పద్ధతుల్లో పంటలు, తోటలు పండించేందుకు మళ్లీ చాలామంది మొగ్గు చూపుతున్న క్రమంలో ఇంకా జగిత్యాల మార్కెట్ లో మాత్రం రసాయనాలతో పండ్లను మాగబెట్టే పద్ధతులు కొనసాగుతుండటంపై పెద్ద రచ్చే జరుగుతోంది. ఇతర దేశాల్లో కార్బైడ్ కలిపిన పండ్లను మార్కెట్ లోకి తీసుకుని వస్తే అంతే సంగతులన్నంత నిషేధం కొనసాగుతోంది. మార్కెట్లలో యదేచ్ఛంగా కార్బైడ్ వాడకం కొనసాగుతోంది. వాయిస్. కెమికల్ ఆధారంగా మామిడి నీ మాగ పెడుతున్నారని వినియోగదారులు చెబుతున్నారు. ఇలాంటి మామిడి తింటే అనారోగ్యానికి గురవుతున్నామని అంటున్నారు.నాణ్యమైన మామిడి పండ్లు లభించడం లేదని అంటున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

భయపెడుతోన్న వాతావరణ శాఖ.. గడపదాటాలంటే ప్రజల్లో వణుకు..
భయపెడుతోన్న వాతావరణ శాఖ.. గడపదాటాలంటే ప్రజల్లో వణుకు..
18 ఏళ్లకే ఇండస్ట్రీలో సంచలనం.. 25 ఏళ్లకే ఆత్మహత్య చేసుకుంది..
18 ఏళ్లకే ఇండస్ట్రీలో సంచలనం.. 25 ఏళ్లకే ఆత్మహత్య చేసుకుంది..
డబ్బులు లెక్కపెడుతుండగా నోట్‌పై కనిపించిన ఏవో పిచ్చిగీతలు..
డబ్బులు లెక్కపెడుతుండగా నోట్‌పై కనిపించిన ఏవో పిచ్చిగీతలు..
బాడీ షేమింగ్‌ చేశారు.. పెళ్లి చేసుకోవాలంటే ఆ కండిషన్ పెట్టారు
బాడీ షేమింగ్‌ చేశారు.. పెళ్లి చేసుకోవాలంటే ఆ కండిషన్ పెట్టారు
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..