TRS: కేసీఆర్‌, కేటీఆర్‌ దగ్గరే తేల్చుకుంటాం.. మంత్రి మల్లారెడ్డిని టార్గెట్‌ చేసిన సొంత పార్టీ ఎమ్మెల్యేలు..

మల్లారెడ్డి ఏకపక్ష ధోరణిని ఇక ఏ మాత్రం సహించేది లేదని తేల్చి చెప్పారు నియోజకవర్గ ఎమ్మెల్యేలు. మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఆధ్వర్యంలో ఆయన ఇంట్లోనే వారంతా భేటీ జరిగింది.

TRS: కేసీఆర్‌, కేటీఆర్‌ దగ్గరే తేల్చుకుంటాం.. మంత్రి మల్లారెడ్డిని టార్గెట్‌ చేసిన సొంత పార్టీ ఎమ్మెల్యేలు..
Target Minister Malla Reddy
Follow us
Sanjay Kasula

|

Updated on: Dec 19, 2022 | 6:32 PM

మేడ్చల్‌ జిల్లా బీఆర్ఎస్‌లో మంత్రి మల్లారెడ్డికి వ్యతిరేకంగా ఎమ్మెల్యేల నుంచే తిరుగుబాటు మొదలైంది. ఇన్నాళ్లు చాప కింద నీరులా ఉన్న అసమ్మతి ఇప్పుడు ఒక్కసారిగా బ్లాస్ట్‌ అయింది. ఐదుగురు ఎమ్మెల్యేలు మంత్రికి వ్యతిరేకంగా మంతనాలు జరిపారు. మల్లారెడ్డి ఏకపక్ష ధోరణిని ఇక ఏ మాత్రం సహించేది లేదని తేల్చి చెప్పారు. మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఆధ్వర్యంలో ఆయన ఇంట్లోనే ఈ భేటీ జరిగింది. కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే వివేక్‌, కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, ఉప్పల్‌ ఎమ్మెల్యే భేతి సుభాష్‌ చర్చలు జరిపారు. నామినేటెడ్‌ పదవులు, ఇతర నిర్ణయాల్లో మంత్రి తీరును తీవ్రంగా ఖండించారు. మంత్రిపై తిరుగుబాటును ప్రకటించారు.

మల్లారెడ్డి మేడ్చల్‌ జిల్లాకు ఇన్‌ఛార్జి మంత్రా లేదంటే మల్కాజ్‌గిరి ఒక్క నియోజకవర్గానికే మంత్రా అని నిలదీశారు ఎమ్మెల్యేలు. తమ నియోజకవర్గాల్లోనూ పార్టీ కోసం పని చేసిన వారు ఉన్నా నామినేటెడ్‌ పదవులన్నీ మల్లారెడ్డి తన మనుషులకే ఇచ్చుకుంటున్నారన్నది వీరి ప్రధాన అభ్యంతరం. గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ పదవినీ తన అనుచరులకే ఇప్పించుకున్నారని విమర్శించారు.

మార్కెట్‌ యార్డ్‌ కమిటీ చైర్మన్‌ పదవిపై కేటీఆర్‌తో చర్చించి నిర్ణయం తీసుకుందామని తాము చెప్పినా మంత్రి హడావిడిగా జీవో ఇప్పించేశారన్నది ఎమ్మెల్యేల ఆగ్రహానికి కారణమైంది. అందరితో చర్చించి నిర్ణయం తీసుకోవాలని గతంలో సీఎం కేసీఆర్‌ సూచించినా మంత్రి ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమను సంప్రదించడం లేదన్నది వీరి అసంతృప్తికి ప్రధాన కారణం. అన్ని పదవులు ఆయన మనుషులకే ఇస్తే ఇక తమ నియోజకవర్గాల్లోని కార్యకర్తల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు ఎమ్మెల్యేలు. ఈ అంశాన్ని కేసీఆర్‌, కేటీఆర్‌ దగ్గరే తేల్చుకుంటామని చెబుతున్నారు ఎమ్మెల్యేలు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం