Hair Style: డిఫరెంట్ హెయిర్ స్టైల్ అంటే మీకు ఇష్టమా.. అయితే ఓ సారి ఈ కటింగ్స్ పై ఓ లుక్కేయండి..
ఫిఫా వరల్డ్ కప్ ముగిసింది. ఇప్పుడు ఎక్కడ చూసినా దాని గురించే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఆటగాళ్లు హెయిర్ స్టైల్ అభిమానులను ఆకట్టుకుంటోంది. చిన్న జుట్టును మెయింటేన్ చేయడం..
ఫిఫా వరల్డ్ కప్ ముగిసింది. ఇప్పుడు ఎక్కడ చూసినా దాని గురించే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఆటగాళ్లు హెయిర్ స్టైల్ అభిమానులను ఆకట్టుకుంటోంది. చిన్న జుట్టును మెయింటేన్ చేయడం సులభమే కాకుండా త్వరగానూ చేసుకోవచ్చు. అన్ని సీజన్‌లకు పర్ఫెక్ట్ గా ఉంటాయి. అయితే జుట్టు కట్ చేసుకోవాలనుకునే పురుషులు ఈ స్టైల్స్ పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. నెలకు ఒకసారి సెలూన్ కు వెళ్తుంటారు. మంచి హెయిర్ స్టైల్ కోసం సెలూన్ కు పరుగులు తీస్తుంటారు. పురుషులు చిన్న కేశాలంకరణను ఎంచుకుంటారు ఎందుకంటే అవి కావాల్సిన రూపాల్లో స్టైలిష్ గా మారిపోతాయి. ఈ సీజన్‌లో షార్ట్ హెయిర్ లుక్‌ని ప్లాన్ చేస్తుంటే తప్పకుండా ఈ స్టైల్స్ ను పాటించండి..
క్రూ కట్.. పురుషులు ఎంచుకోగల అత్యంత స్టైలిష్ షార్ట్ హెయిర్ లుక్‌లు. ఇది సాధారణంగా తల వెనుక షేవింగ్ చేస్తుంది. తల పైన ఉన్న జుట్టు కొంచెం పొడవుగా కట్ చేస్తారు. షేవ్ చేసిన భాగం లో బజ్ కట్ చేయడం ద్వారా ఈ ఆకారాన్ని పొందవచ్చు.
క్రాప్ బజ్ ఈ స్టైల్ లో వెనక నున్నగా షేవ్ చేస్తారు. దీనికి తక్కువ మెయింటెయిన్స్ అవసరం ఉంటుంది. ఓవల్ లేదా డైమండ్ ఆకారంలో ముఖం ఉండే వారికి ఈ స్టైల్ సరిగ్గా సరిపోతుంది.
View this post on Instagram
మిడ్ ఫేడ్ జుట్టు పొడవాటి పొట్టి భాగాల మధ్య కలయిక తల కిరీటం దగ్గర జరుగుతుంది. ఇది వృత్తం, చతురస్రం, గుండ్రని ముఖ ఆకారాలకు సెట్ అవుతుంది.
View this post on Instagram
బజ్ కట్
ఈ స్టైల్‌లో పొట్టి , పొడవాటి జుట్టు మధ్య ఫేడింగ్ ఉండదు. ఈ లుక్ కాస్త ధైర్యం ఉన్నవాళ్లు మాత్రమే చేయగలుగుతారు. అయితే ఇది త్వరగానే అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.
View this post on Instagram
బ్రష్ కట్ ఈ కట్‌లో, భుజాలు, వెనక వెంట్రుకలు పైభాగం కంటే కొంచెం ఎక్కువగా కత్తిరిస్తారు. దీంతో ఇది బ్రష్ చేసిన జుట్టు రూపాన్ని ఇస్తుంది.
View this post on Instagram