BRS Party: ఆ సామాజిక వర్గానికే హైదరాబాద్ లోక్ సభ సీటు.. బీఆర్ఎస్ కీలక ప్రకటన..
తెలంగాణలో రాజకీయాలు రోజు రోజుకు అగ్గిరాజేస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో వెనుకబడిని బీఆర్ఎస్ లోక్ సభ ఎన్నికల్లో తన సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. అందులో భాగంగానే అభ్యర్ధులు ఎంపిక విషయంలో ఆచీచూచి అడుగులు వేస్తోంది.
తెలంగాణలో రాజకీయాలు రోజు రోజుకు అగ్గిరాజేస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో వెనుకబడిన బీఆర్ఎస్ లోక్ సభ ఎన్నికల్లో తన సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. అందులో భాగంగానే అభ్యర్ధులు ఎంపిక విషయంలో ఆచీచూచి అడుగులు వేస్తోంది. మొన్నటి వరకు తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాలకు గాను 16 స్థానాలకు ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒక్క హైదరాబాద్ స్థానాన్ని పెండింగ్లో ఉంచారు. అయితే తాజాగా ఈ స్థానాన్ని ప్రకటించారు. గడ్డం శ్రీనివాస్ యాదవ్ ను లోక్ సభ ఎన్నికల్లో హైదరాబాద్ నుంచి పోటీ చేయించనున్నట్లు తెలిపారు.
హైదరాబాద్ ఎంఐఎం కు కంచుకోటలా ఉంది. గత కొన్ని దశాబ్ధాలుగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఈ స్థానాన్ని గెలుస్తూ వస్తున్నారు. అయితే బీజేపీ కూడా ఈ స్థానంపై కన్నేసింది. అందులో భాగంగానే సాఫ్ట్ హిందుత్వా అనే అంశాన్ని భుజానికి ఎత్తుకుని విరంచి హాస్పిటల్స్ మాజీ చైర్మెన్న మాధవీ లతను అభ్యర్థిగా ప్రకటించింది. అయితే వీరందరినీ ఢీ కొట్టేందుకు కేసీఆర్ బీసీ సామాజిక వర్గానికి చెందిన గడ్డం శ్రీనివాస్ యాదవ్ కు కేటాయించడం రాజకీయ వర్గాల్లో కాస్త ఆసక్తిని రేపుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ కు అశించినన్ని సీట్లు రాలేదు. అన్ని స్థానాలు బీఆర్ఎస్ ఖాతాలో వచ్చి పడ్డాయి. ఈ నేపథ్యంలోనే బీజేపీ చెబుతున్న బీసీ నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి ఈ సీటును తన ఖాతాలో వేసుకోవాలని భావిస్తున్నట్లు కనిపిస్తోంది.
బీఆర్ఎస్ ప్రకటించిన లోక్ సభ అభ్యర్థులు..
- సికింద్రాబాద్ – పద్మారావుగౌడ్
- హైదరాబాద్- గడ్డం శ్రీనివాస్ యాదవ్
- మల్కాజిగిరి – రాగిడి లక్ష్మారెడ్డి
- కరీంనగర్ – వినోద్‌కుమార్
- పెద్దపల్లి – కొప్పుల ఈశ్వర్
- ఖమ్మం – నామా నాగేశ్వరరావు
- మహబూబాబాద్ – మాలోత్ కవిత
- చేవెళ్ల – కాసాని జ్ఞానేశ్వర్
- వరంగల్ – డాక్టర్ కడియం కావ్య
- జహీరాబాద్ – అనిల్‌కుమార్
- నిజామాబాద్ – బాజిరెడ్డి గోవర్ధన్
- నాగర్‌కర్నూల్ – ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్
- మహబూబ్‌నగర్ – మన్నె శ్రీనివాస్‌రెడ్డి
- మెదక్ – వెంకట్రామిరెడ్డి
- ఆదిలాబాద్ – ఆత్రం సక్కు
- నల్గొండ – కంచర్ల కృష్ణారెడ్డి
- భువనగిరి- క్యామ మల్లేశ్
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..