తెలుగు రాష్ట్రాల్లో అంబరాన్నంటిన హోలీ సంబరాలు.. ప్రజలకు సీఎం రేవంత్, జగన్ శుభాకాంక్షలు..

తెలుగురాష్ట్రాల్లో హోలీ సంబరాలు అంబరాన్ని తాకాయి. హైదరాబాద్‌, ఖమ్మం, ఆదిలాబాద్‌ జిల్లావ్యాప్తంగా హోలీవేడుకలు జరుపుకుంటున్నారు. ప్రతి ఒక్కరి జీవితాల్లో రంగులు నిండాలని ఈ పండుగను ఆనందోత్సాహాల మధ్య చిన్నాపెద్దా తేడా లేకుండా హోలీ ఆడారు. పలు చోట్ల కామదహనాలు కూడా జరిపారు.

తెలుగు రాష్ట్రాల్లో అంబరాన్నంటిన హోలీ సంబరాలు.. ప్రజలకు సీఎం రేవంత్, జగన్ శుభాకాంక్షలు..
Holi Celebrations
Follow us
Srikar T

|

Updated on: Mar 25, 2024 | 11:14 AM

తెలుగురాష్ట్రాల్లో హోలీ సంబరాలు అంబరాన్ని తాకాయి. హైదరాబాద్‌, ఖమ్మం, ఆదిలాబాద్‌ జిల్లావ్యాప్తంగా హోలీవేడుకలు జరుపుకుంటున్నారు. ప్రతి ఒక్కరి జీవితాల్లో రంగులు నిండాలని ఈ పండుగను ఆనందోత్సాహాల మధ్య చిన్నాపెద్దా తేడా లేకుండా హోలీ ఆడారు. పలు చోట్ల కామదహనాలు కూడా జరిపారు. మన్మధుని పరాకాష్టకు పరమ శివుడు ఆగ్రహరూపం దాల్చిన సందర్భంగా కాముడిని దహనం చేసిన రోజుగా కామదహనం జరుపుకుంటారు. ఈ వేడుకల్లో భాగంగా మహిళలు, చిన్నారులు ఆటపాటలతో అలరించారు. అనంతరం నిర్వహించిన కామదహనానికి హాజరయ్యారు. అంతా మంచి జరగాలని వేడుకున్నారు.అటు జనగామ జిల్లా వ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరాన్ని తాకాయి. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ సంబురాల్లో మునిగిపోయారు. జనగామలో వాకర్స్ అసోసియేషన్, మిత్రమండలి ఆధ్వర్యంలో యువకులు సందడి చేశారు. డీజే పాటలకు డాన్సులు చేస్తూ ఎంజాయ్‌ చేశారు.

ఆదివాసీ గూడాలలో హోలీ పండుగ సంబరాలు అంబరాన్ని అంటుతోంది. గిరిజనులు ఆడే ఆటపాటలు ఆదివాసుల రంగుల వేడుకలు అడవికే అందానిస్తున్నాయి. అడవులతోనే మమేకమైన ఆదివాసుల సహజమైన జీవనశైలికి దురాడీ పండగ అద్దం పడుతుంది. ఆంధ్రప్రదేశ్‌లోనూ హోలీ వేడుకలు జరుగుతున్నాయి. అల్లూరి జిల్లా తాజంగిలో హోలీ సందర్భంగా రాధాకృషనులకు ప్రత్యేక పూజలు చేశారు. 75 అడుగుల కట్టెల దహనం ఉత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కట్టెలపై ఉన్న జెండాను పట్టుకునేందుకు స్థానికుల మధ్య పోటీ పెట్టారు. కింద పడకుండా పట్టుకునే వారికి నగదుతో ప్రోత్సాహం ఇచ్చారు. వరంగల్‌లో డిఫరెంట్‌గా టమాటలతో హోలీ జరుపుకున్నారు వరంగల్‌ ప్రజలు. మన రాష్ట్రాల్లోనే కాకుండా దేశ విదేశాల్లో కూడా సంబరాలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. అలాగే ఇరు రాష్ట్రాల ముఖ్య మంత్రులు ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆనందంగా, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..