టీడీపీలోకి రఘురామకృష్ణం రాజు..? రెండు వారాల్లో పోటీపై స్పష్టత..
నర్సాపురం ఎంపీ టిక్కెట్ ఆశించిన రఘురామకృష్ణరాజుకు ఊహించని షాక్ తగిలింది. బీజేపీ అభ్యర్ధిగా శ్రీనివాసవర్మను బరి లోకి దింపడంతో ఆయనకు నిరాశే ఎదురయ్యింది. జగన్ ఇన్‌ఫ్లూయెన్స్ చేయడం వల్లే టిక్కెట్ రాలేదని రఘురామ సంచలన ఆరోపణలు చేశారు.
నర్సాపురం ఎంపీ టిక్కెట్ ఆశించిన రఘురామకృష్ణరాజుకు ఊహించని షాక్ తగిలింది. బీజేపీ అభ్యర్ధిగా శ్రీనివాసవర్మను బరి లోకి దింపడంతో ఆయనకు నిరాశే ఎదురయ్యింది. జగన్ ఇన్‌ఫ్లూయెన్స్ చేయడం వల్లే టిక్కెట్ రాలేదని రఘురామ సంచలన ఆరోపణలు చేశారు. రఘురామకృష్ణంరాజుకు నరసాపురం ఎంపీ టికెట్ దక్కలేదు..! కానీ 2-3 వారాల్లో ఏమైనా జరగొచ్చని ఆయన అంటున్నారు. ఈ మాటల అర్థమేంటి..! ఆయన TDPలో చేరాలనుకుంటున్నారా..! తాజా పరిణామాల్ని బట్టి చూస్తే ఈ విషయంలో ఇంకొంచెం క్లారిటీ వచ్చినట్టు కనిపిస్తోంది. ముందుగా కూటమిలో సీట్ల లక్కల ప్రకారం విజయనగరం BJPకి అనుకున్నారు. కానీ.. రాజంపేట BJPకి ఇచ్చి విజయనగరంలో TDPనే పోటీ చేస్తున్న నేపథ్యంలో ఆ సీటు రఘురామకు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఐతే.. నరసాపురం పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని ఉండి నుంచి అసెంబ్లీకి రఘురామ పోటీ చేసే అవకాశం ఉన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి.
ఈ వారంలో రఘురామ పోటీపై స్పష్టత వచ్చే అవకాశం ఉందంటున్నారు ఆయన. చంద్రబాబుతో కలిసి నడుస్తానని నిన్న ప్రెస్‌మీట్‌లో రఘురామ చెప్పడంతో ఆయన TDPలో చేరతారనే మాట బలంగా వినిపిస్తోంది. మంచి ఆశయం ఉన్న చంద్రబాబుతో కలిసి నడుస్తానని నిన్న రఘురామకృష్ణం రాజు చెప్పారు. ఇదంతా ఇలా ఉంటే.. జగన్ ఇన్‌ఫ్లూయెన్స్ చేయడం వల్లే టిక్కెట్ రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు రఘురామ. ఆయన ఆరోపణలతో బీజేపీ, టీడీపీ, జనసేన నేతలు విస్తుపోతున్నారు. కూటమి పక్షాలను జగన్ ఎలా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తారంటూ వాళ్లంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ టిక్కెట్ కోసం గత 10 రోజులుగా లాబీయింగ్ చేశారు రఘురామరాజు. అయినప్పటికి ఫలితం లేకుండా పోయింది. గత కొన్ని సంవత్సరాలుగా ఏపీ సీఎం జగన్‌పై యుద్దం ప్రకటించిన నరసాపురం ఎంపీ రఘురామరాజుకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇదే నేపథ్యంలో బీజేపీ,టీడీపీ,జనసేన కూటమి ఆయనకు షాకిచ్చింది. నరసాపురం ఎంపీ టిక్కెట్ విషయంలో ఆయనకు మొండిచెయ్యి చూపించారు పార్టీల నేతలు. దీంతో ఆయన బీజేపీ పైనే నేరుగా ఆరోపణలు చేయడం సంచలనం రేపింది.
నరసాపురం టిక్కెట్ బీజేపీ నేత శ్రీనివాసవర్మ దక్కించుకున్నారు. మొదటి నుంచి ఆయన బీజేపీ లోనే ఉండడం ప్లస్‌పాయింట్ అయ్యింది. వాస్తవానికి తనకు ఎంపీ టిక్కెట్ దక్కుతుందని చాలా ఆశించారు రఘురామ. జగన్ పాలనలో తాను చాలా కష్టాలు అనుభవించానని, జైలుకు కూడా వెళ్లానని, కాని తనకు ఫలితం దక్కలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్‌కళ్యాణ్ మద్దతుతో తనకు తప్పకుండా టిక్కెట్ దక్కుతుందని ఆశించారు. తాడెపల్లిగూడెం కూటమి సభలో పాల్గొన్న రఘురామ తప్పకుండా టిక్కెట్ దక్కుతుందని ప్రకటించారు. కాని ఆయనకు ఆశాభంగం తప్పలేదు. ఆయన 2019 ఎన్నికల్లో నరసాపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి వైఎస్‌ఆర్‌సిపి అభ్యర్థిగా పోటీ చేశారు. టిడిపికి చెందిన వేటుకూరి వెంకట శివరామరాజు కంటే 31,909 ఓట్ల తేడాతో 38.11% ఓట్లు సాధించి ఎన్నికల్లో విజయం సాధించారు. ఈసారి మరి ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్నది ఆసక్తిగా మారింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..