దొంగలను తరిమికొట్టిన తల్లీకూతుళ్లను అభినందించిన కేంద్రమంత్రి
హైదరాబాద్ బేగంపేట్‌లో ఓ ఇంట్లో పట్టపగలు దొంగలు చొరబడి దోపిడీకి యత్నించగా వారిని ఆ ఇంట్లోని తల్లీకూతుళ్లు ఇద్దరూ ఎంతో ధైర్యంగా ఎదుర్కొన్నారు. గన్‌తో దొంగలు దాడి చేస్తున్నా భయపడకుండా వీరోచితంగా పోరాడి దొంగలను పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. తాజాగా ఈ ఘటనపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ఇంట్లో చొరబడి గన్నులతో బెదిరిస్తున్న దొంగలకు భయపడకుండా తల్లీ కూతుళ్లు ఇద్దరూ ఎదుర్కొన్న తీరు అభినందనీయం అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.
హైదరాబాద్ బేగంపేట్‌లో ఓ ఇంట్లో పట్టపగలు దొంగలు చొరబడి దోపిడీకి యత్నించగా వారిని ఆ ఇంట్లోని తల్లీకూతుళ్లు ఇద్దరూ ఎంతో ధైర్యంగా ఎదుర్కొన్నారు. గన్‌తో దొంగలు దాడి చేస్తున్నా భయపడకుండా వీరోచితంగా పోరాడి దొంగలను పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. తాజాగా ఈ ఘటనపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ఇంట్లో చొరబడి గన్నులతో బెదిరిస్తున్న దొంగలకు భయపడకుండా తల్లీ కూతుళ్లు ఇద్దరూ ఎదుర్కొన్న తీరు అభినందనీయం అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మహిళలు బలహీనులు కాదని, సమస్యను ఎదుర్కోడానికి బాహుబలమే కాకుండా బుద్ధిబలం, ధైర్యం చాలా ముఖ్యమన్నారు. దొందలతో పోరాడుతున్న తల్లికి 15 ఏళ్ల కుమార్తె సాయం చేయడం… ఇద్దరూ కలిసి దొంగలను తరిమి కొట్టడం ఎంతో స్పూర్తిదాయకం అన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వైరల్ వీడియోలు
Latest Videos