గంజాయి మత్తులో సర్కారీ స్కూల్ అమ్మాయిలు
తమ పిల్లలు బాగా చదువుకొని ఉన్నత స్థితికి చేరుకుంటారని తల్లిదండ్రులు పాఠశాలకు పంపిస్తుంటే.. వారినే టార్గెట్‌గా చేసుకొని కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. అభం శుభం తెలియని విద్యార్ధులను మత్తు పదార్ధాలకు బానిసలను చేస్తున్నారు. వారి జీవితాలతో ఆడుకుంటున్నారు. చాక్లెట్లు, ఇతర రూపాలలో మత్తు పదార్ధాలను విద్యార్ధులకు విక్రయిస్తూ వారిని మత్తులో ముంచేస్తున్నారు. తాజాగా జగిత్యాల జిల్లాలోవిద్యార్ధులకు డ్రగ్స్ విక్రయాలు కలకలం రేపాయి.
తమ పిల్లలు బాగా చదువుకొని ఉన్నత స్థితికి చేరుకుంటారని తల్లిదండ్రులు పాఠశాలకు పంపిస్తుంటే.. వారినే టార్గెట్‌గా చేసుకొని కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. అభం శుభం తెలియని విద్యార్ధులను మత్తు పదార్ధాలకు బానిసలను చేస్తున్నారు. వారి జీవితాలతో ఆడుకుంటున్నారు. చాక్లెట్లు, ఇతర రూపాలలో మత్తు పదార్ధాలను విద్యార్ధులకు విక్రయిస్తూ వారిని మత్తులో ముంచేస్తున్నారు. తాజాగా జగిత్యాల జిల్లాలోవిద్యార్ధులకు డ్రగ్స్ విక్రయాలు కలకలం రేపాయి. వీరికి చాక్లెట్లు, ఇతర రూపాలలలో డ్రగ్స్ విక్రయిస్తున్నారు. పేద,మధ్య తరగతి కుటుంబాల అవసరాలని ఆసరాగా చేసుకొని మొదట డ్రగ్స్,గంజాయి లకి అలవాటు చేసి సెక్స్ రాకేట్ నడుపుతున్నారన్న వార్త ఇప్పుడు జగిత్యాల జిల్లా లో కలకలం రేపుతుంది. మత్తుకు బానిస అయిన తమ కూతురు పై అత్యాచారం జరిగిందని ఓ బాధిత కుటుంబం ఫిర్యాదు తో వెలుగులోకి వచ్చింది. ఛైల్డ్ వెల్ఫేర్ విచారణలో విస్తుబొయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. జగిత్యాల జిల్లా కేంద్రం లో ఓ ప్రభుత్వ పాఠశాలలొ చదువుతున్న చిన్నారి గంజాయి మత్తుకు అలావాటు పడింది.తనతో పాటుగా చదువుకుంటున్న మరో బాలుడు కూడా డ్రగ్స్‌కి అలవాటు పడ్డాడు. ఆ బాలుడే ఈ బాలికకు డ్రగ్స్ ఇచ్చేవాడు. అలా బాలుడిపై గంజాయి కొసం బాలిక అధారపడేది. కొద్ది రొజులకి అ బాలుడు గంజాయి ఇవ్వకపోవడం తో వేరే యువకుడికి దగ్గర అయ్యింది. అతడు చెప్పినట్లు చేస్తే గంజాయి డ్రగ్స్ కొసం డబ్బులు ఇచ్చేవాడని బాలిక స్వదార్ హోం,సైకియాలజిస్ట్ కి తెలిపింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

