మాస్కోలో ఉగ్రదాడి.. ఉక్రెయిన్‌ హస్తముందన్న రష్యా

మాస్కోలో ఉగ్రదాడి.. ఉక్రెయిన్‌ హస్తముందన్న రష్యా

Phani CH

|

Updated on: Mar 24, 2024 | 7:56 PM

భీకర ఉగ్రదాడితో రష్యా ఉలిక్కిపడింది. మాస్కోలోని క్రాకస్‌ సిటీ కాన్సర్ట్‌ హాల్‌లోకి చొరబడిన సాయుధ ముష్కరులు.. విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటన లో మృతుల సంఖ్య 115కు చేరుకుందని, అందులో ముగ్గురు చిన్నారులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం 11 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. వీరిలో నలుగురు దాడిలో ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు వెల్లడించారు. బ్రయాన్స్క్ ప్రాంతంలో ‘కార్ ఛేజ్’ చేసి వారిని పట్టుకున్నట్లు సమాచారం.

భీకర ఉగ్రదాడితో రష్యా ఉలిక్కిపడింది. మాస్కోలోని క్రాకస్‌ సిటీ కాన్సర్ట్‌ హాల్‌లోకి చొరబడిన సాయుధ ముష్కరులు.. విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటన లో మృతుల సంఖ్య 115కు చేరుకుందని, అందులో ముగ్గురు చిన్నారులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం 11 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. వీరిలో నలుగురు దాడిలో ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు వెల్లడించారు. బ్రయాన్స్క్ ప్రాంతంలో ‘కార్ ఛేజ్’ చేసి వారిని పట్టుకున్నట్లు సమాచారం. రష్యా భద్రత సంస్థ శనివారం అధ్యక్షుడు పుతిన్‌కు దీనిపై సమాచారం అందించినట్లు స్ధానిక ప్రభుత్వ వార్తాసంస్థ పేర్కొంది. మాస్కోలోని క్రాస్నోగోర్స్క్‌లో ఉన్న క్రాకస్‌ సిటీ హాల్‌లో షాపింగ్ మాల్, సంగీత కచేరీ వేదిక ఉన్నాయి. రష్యన్ రాక్ బ్యాండ్ పిక్నిక్ ప్రదర్శనకు శుక్రవారం పెద్దఎత్తున అభిమానులు వెల్లువెత్తారు. ఈ క్రమంలోనే ముష్కరులు వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దొంగలను తరిమికొట్టిన తల్లీకూతుళ్లను అభినందించిన కేంద్రమంత్రి

గంజాయి మత్తులో సర్కారీ స్కూల్ అమ్మాయిలు

నడి సముద్రంలో ఓ వ్యక్తికి గుండెపోటు.. ఆ తర్వాత ఏం జరిగింది