AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SRH: వరదా వాడిని ఆపు..! రాసిపెట్టుకో.. వీడు మెంటలోడు ఈసారి SRH‌కి కప్పు కొట్టాకే ఆగేది

సన్ రైజర్స్ హైదరాబాద్ ఈసారి బలంగా కనిపిస్తోంది. ప్రత్యర్ధులకు భయం పుట్టించేలా ఉన్న ఈ జట్టు.. 2025 ఐపీఎల్ సీజన్‌లో ట్రోఫీ కొట్టాలని దృడ నిశ్చయంతో ఉంది. ముఖ్యంగా ప్యాట్ కమిన్స్ వ్యూహాలు.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.. అదేంటంటే.. చూద్దాం..

SRH: వరదా వాడిని ఆపు..! రాసిపెట్టుకో.. వీడు మెంటలోడు ఈసారి SRH‌కి కప్పు కొట్టాకే ఆగేది
Srh
Ravi Kiran
|

Updated on: Mar 11, 2025 | 9:59 PM

Share

వరదా వాడిని ఆపు.. అని సలార్‌ను ఆపాలని వరదరాజమన్నార్‌కి చెప్తారు కదా. అలాగే సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఈసారి కప్పు కొట్టేదాకా ఆగేలా లేదు ఆ జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్. 2024లో SRH టీం ఓనర్ భారీ ధరను వెచ్చించి మరీ ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌ను వేలంలో కొనుగోలు చేసింది. ఆ వెంటనే తమ జట్టుకు కెప్టెన్‌గా ఎంపిక చేసింది. ఇక కెప్టెన్సీ అందుకున్న వెంటనే.. ప్రతీ జట్టుకూ భయాన్ని పరిచయం చేశాడు ఈ సలారోడు. 2024 ముందు వరకు SRH అంటేనే బౌలింగ్ జట్టుగా పేరొందింది. ఎప్పుడైతే.. ప్యాట్ వచ్చాడో.. బ్యాటింగ్ టీంగా మారిపోయింది. మరీ ముఖ్యంగా ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలను ఎదుర్కోవాలంటేనే ప్రత్యర్ధులు భయపడ్డారు. అంతలా జట్టును తన రాకతో మార్చేశాడు ప్యాట్ కమిన్స్. ఒక్క అడుగు దూరంలో ఐపీఎల్ ట్రోఫీని గతేడాది మిస్ చేసుకున్న ఈ సలారోడు.. ఈ ఏడాది కచ్చితంగా సన్‌రైజర్స్‌కి కప్పు అందించాలన్న లక్ష్యంతో టోర్నీలోకి అడుగుపెట్టబోతున్నాడు. అలాగే తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ ట్రెండ్ కూడా.. ఇది సాధ్యమని చెబుతోంది. మరి ఆ ట్రెండ్ ఏంటంటే.?

సన్‌రైజర్స్ కంటే ముందు హైదరాబాద్ ఫ్రాంచైజీని డెక్కన్ ఛార్జర్స్ పేరిట ఉండేది. 2008లో ఐపీఎల్ స్టార్ట్ కాగా.. మొదట డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాదీ ఫ్రాంచైజీని రన్ చేసింది. ఆ సమయంలో ఈ జట్టు కెప్టెన్‌గా వ్యవహరించాడు ఆడమ్ గిల్‌క్రిస్ట్. మొదటి సీజన్‌లో డెక్కన్ ఛార్జర్స్ ఆఖరి స్థానంలో ఉండగా.. ఆ తర్వాతి సీజన్ అనగా 2009లో ఛాంపియన్‌గా నిలిచింది డెక్కన్ ఛార్జర్స్. ఇక 2015లో డేవిడ్ వార్నర్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కెప్టెన్ కాగా.. ఆ తర్వాతి సీజన్ 2016 ఫైనల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఓడించి కప్పు గెలిచింది SRH టీం. ఇక ఇప్పుడు అదే సీన్ ప్యాట్ కమిన్స్ టైంలోనూ రిపీట్ అవుతోంది. 2024లో కమిన్స్ SRHకి కెప్టెన్‌గా మారగా.. ఆ ఏడాది కప్పు కొట్టలేకపోయింది. ఇక ఇప్పుడు ఈ ఇయర్ కప్పు పక్కా అని ఆరెంజ్ ఆర్మీ ఆశలు పెట్టుకుంది.