MS Dhoni: ధోని మీరు అనుకున్నంత కూల్ ఏంకాదు! తల విశ్వరూపాన్ని లీక్ చేసిన రాయుడు!
అంబటి రాయుడు తాజా ఇంటర్వ్యూలో ధోనీ బిర్యానీ ప్రేమను గుర్తుచేశాడు. 2014 ఐపీఎల్ సమయంలో, హైదరాబాద్ బిర్యానీని తినేందుకు ధోనీ తన బస హోటల్‌ను మార్పించుకున్నాడు. అదే సమయంలో క్రికెట్‌లో పీఆర్ హైప్ కారణంగా ప్రతిభ గల ఆటగాళ్లకు నష్టమవుతోందని రాయుడు విమర్శించాడు. ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతూ, క్రికెట్‌లో నిజమైన టాలెంట్‌కి ప్రాధాన్యత ఇవ్వాలనే చర్చను తెరపైకి తెచ్చాయి.

అంబటి రాయుడు తాజాగా ఓ తెలుగు యూట్యూబ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ముఖ్యంగా బిర్యానీ కోసం మహేంద్ర సింగ్ ధోనీ హోటల్ మారించుకున్న అనుభవాన్ని గుర్తు చేసుకున్నాడు. హైదరాబాద్ బిర్యానీ ప్రత్యేకత గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. దేశ, విదేశాల నుంచి ఎవరైనా భాగ్యనగరానికి వచ్చినా, దమ్ బిర్యానీని తప్పనిసరిగా ఆస్వాదిస్తారు. టీమిండియా క్రికెటర్లకు కూడా హైదరాబాద్ బిర్యానీ అంటే మక్కువ ఎక్కువ. వారు నగరానికి వచ్చినప్పుడు తమ స్ట్రిక్ట్ డైట్‌ను పక్కనబెట్టి మరీ బిర్యానీ లాంగించేస్తారు. అయితే, టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ దిగ్గజ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీ అయితే ఓ అడుగు ముందుకేసి, బిర్యానీ కోసం హోటల్‌ను మార్చేసిన సంఘటన ఒకటి జరిగింది.
ఈ ఘటన 2014 ఐపీఎల్ సీజన్‌లో చోటుచేసుకుంది. అప్పటి ఐపీఎల్ మ్యాచ్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు హైదరాబాద్ వచ్చారు. ఆ జట్టులోని టీమిండియా క్రికెటర్లు సురేశ్ రైనా, ధోనీ ఇతర ఆటగాళ్లు బిర్యానీ తినాలని కోరారు. అంబటి రాయుడు తన ఇంట్లో ప్రత్యేకంగా తయారుచేసిన బిర్యానీని హోటల్‌కు పంపించాడు. కానీ హోటల్ సిబ్బంది ఔట్‌సైడ్ ఫుడ్ అనుమతి లేదని చెప్పి బిర్యానీని అంగీకరించలేదు. దీంతో ధోనీ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. అతను ఏ విషయాన్నైనా తాననుకున్నట్టు చేయకపోతే అస్సలు సహించడు. అందుకే తక్షణమే హోటల్‌ను మార్పించుకునే నిర్ణయం తీసుకున్నాడు. అప్పటి నుంచి ఆ హోటల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు బస చేయడం లేదు.
అంబటి రాయుడు ఈ సందర్భంగా మరో ఆసక్తికరమైన అంశాన్ని ప్రస్తావించాడు. క్రికెట్‌లో పీఆర్‌ల ప్రాభావం ఎక్కువైందని, వీటివల్ల నిజమైన ప్రతిభ కలిగిన ఆటగాళ్లకు నష్టమవుతోందని అన్నాడు. మైదానంలో ఆటగాళ్ల ప్రదర్శన కంటే పీఆర్‌ల హైప్ ఎక్కువైందని, కొంతమంది ఆటగాళ్లు తక్కువ ఆడినా పెద్ద ఎలెవేషన్ తీసుకుంటున్నారని విమర్శించాడు. గతంలో ఇది ఇలా ఉండేదికాదని, ఇప్పుడు మాత్రం అసలు టాలెంట్‌కు అవకాశం లేకుండా మారిందని చెప్పాడు. ఈ నేపథ్యంలో క్రికెట్‌లో పీఆర్‌ల ప్రభావాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని రాయుడు డిమాండ్ చేశాడు.
అంబటి రాయుడు చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. క్రికెట్‌లో పీఆర్‌ల ప్రభావం ఎక్కువైపోయిందన్న అతని విమర్శలు చాలా మంది అభిమానులు, విశ్లేషకుల దృష్టిని ఆకర్షించాయి. ఆటగాళ్లకు సొంత ప్రతిభ కంటే, మార్కెటింగ్, బ్రాండ్ ప్రమోషన్‌ల ద్వారా ఎక్కువ అవకాశాలు వస్తున్నాయన్న రాయుడు మాటలు కొంతవరకు నిజమేనని కొందరు అభిమానులు అంగీకరిస్తున్నారు. మరికొందరు మాత్రం ఇది వ్యక్తిగత అనుభవంపై ఆధారపడిన అభిప్రాయమని చెబుతున్నారు. ఏదేమైనా, ధోనీ హోటల్ మార్చేసిన ఘటనతో పాటు, క్రికెట్‌లో పీఆర్‌ల ప్రభావం అనే అంశంపై రాయుడు చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..