AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: రేయ్‌ ఎవర్రా మీరంతా? రీల్స్‌ పిచ్చితో ప్రాణాలమీదకు తెచ్చుకుంటారా? వీడియో చూస్తే భయపుట్టాల్సిందే

ఉత్తరప్రదేశ్‌లో ఓ యువకుడు ఇన్‌స్టాగ్రామ్ రీల్ కోసం ప్రమాదకరమైన స్టంట్ చేయడానికి ప్రయత్నించాడు. వేగంగా ప్రయాణిస్తున్న రైలులోంచి జారిపడటం తప్పించుకున్నాడు. ఈ ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు యువతలో పెరుగుతున్న రీల్స్ పిచ్చిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

Viral Video: రేయ్‌ ఎవర్రా మీరంతా? రీల్స్‌ పిచ్చితో ప్రాణాలమీదకు తెచ్చుకుంటారా? వీడియో చూస్తే భయపుట్టాల్సిందే
Train Reels
SN Pasha
|

Updated on: Mar 11, 2025 | 11:18 PM

Share

ఈ మధ్యకాలంతో కొంతమందికి రీల్స్‌ పిచ్చి బాగా పెరిగిపోతుంది. రీల్స్‌ చేసేందుకు, వ్యూస్‌ తెచ్చుకునేందుకు ఏం చేసేందుకైనా వెనకాడటం లేదు ఈ కాల యువత. ఈ రీల్స్‌ పిచ్చితో కొంతమంది ప్రాణాలు కూడా పొగొట్టుకున్న ఘటనలు కూడా ఉన్నాయి. తాజాగా ఓ కుర్రాడు రీల్స్ పిచ్చితో ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ వీడియో చూస్తే.. ఎవరికై భయం పుట్టాల్సిందే. అంత షాకింగ్‌గా ఉన్న ఈ వీడియోపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఒక కుర్రాడు ఇన్‌స్టాగ్రామ్ రీల్ కోసం నిర్లక్ష్యంగా స్టంట్ చేయడానికి ప్రయత్నిస్తూ కదులుతున్న రైలు నుండి జారిపడ్డాడు.

ఈ సంఘటన కాస్‌గంజ్ నుంచి కాన్పూర్‌కు ప్రయాణిస్తున్న రైలులో జరిగింది. ఓ కుర్రాడు రీల్‌ చేసేందుకు అతి వేగంతో వెళ్తున్న రైలు కిటికి కడ్డీలను పట్టుకొని బయటికి వేళాడుతూ ఉన్నాడు. రైలు మరింత వేగం అందుకోవడంతో అతను కిందపడిపోయే పరిస్థితి వచ్చింది. కొద్ది సేపట్లో పడిపోతాడు అనే టైమ్‌లో ఎవరో అత్యవసర చైన్‌ లాగి ఉంటారు. దాంతో ట్రైన్‌ కాస్త స్లో అయింది. దీంతో ఆ కుర్రాడు పక్కకి దూకే ప్రయత్నంలో కింద పడిపోయాడు. తలకు బలమైన గాయం తగలకపోవడంతో అతను మళ్లీ వచ్చి ట్రైన్‌ ఎక్కేశాడు. అయితే అదే టైమ్‌లో ట్రైన్‌ వేగంగానే వెళ్తుంటే కచ్చితంగా ప్రాణాలు కోల్పోయేవాడు. కాగా, ఈ వీడియో వెలుగులోకి వచ్చిన వెంటనే, అదనపు డైరెక్టర్ జనరల్ కాన్పూర్ అధికారిక హ్యాండిల్ ఈ సంఘటనపై దర్యాప్తు చేయాలని ఫతేఘర్ పోలీసులను ఆదేశించింది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.