Watch Video: హోలీలోనే కాదు ఓటు హక్కులోనూ ఆదర్శంగా నిల్చిన 119ఏళ్ల బామ్మ..

Watch Video: హోలీలోనే కాదు ఓటు హక్కులోనూ ఆదర్శంగా నిల్చిన 119ఏళ్ల బామ్మ..

P Shivteja

| Edited By: Srikar T

Updated on: Mar 25, 2024 | 1:03 PM

హోలీ పండుగ వచ్చిదంటే చాలు దేశం మొత్తం రంగుల మయంగా మారుతుంది. యువతీ, యువకుల ఆటపాటలతో సందడిగా మారుతుంది. చిన్నారుల నుంచి పెద్దవారి వరకు రంగులు చల్లుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలుపుకోవటం ఆనవాయితీ.

హోలీ పండుగ వచ్చిదంటే చాలు దేశం మొత్తం రంగుల మయంగా మారుతుంది. యువతీ, యువకుల ఆటపాటలతో సందడిగా మారుతుంది. చిన్నారుల నుంచి పెద్దవారి వరకు రంగులు చల్లుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలుపుకోవటం ఆనవాయితీ. ఇదే నేపథ్యంలో 119 ఏళ్ల మూసలావిడ తన ముని మనవళ్లతో హొలీ ఆడింది. వివరాల్లోకి వెళ్తే సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం రిమ్మనగూడ గ్రామంలో 119 సంవత్సరాల వృద్ధురాలు పంజాల లక్ష్మి హోలీ పండుగ సందర్భంగా తన ముని మనవళ్లతో సరదాగా హోలీ ఆడింది. ప్రస్తుతం చాలా మంది పలు పండుగలపై ఎలాంటి శ్రద్ధ కనబరచని రోజుల్లో కూడా తన వృద్ధాప్యాన్ని లెక్క చేయకుండా ప్రతి హోలీకి పిల్లలకు హోలీ రంగులు అద్దుతూ పండుగ జరుపుకోవడంతో పాటు ప్రతి ఎన్నికల్లో తను ఓటు వేసి తన ఓటు హక్కును వినియోగించుకుంటు ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది ఈ బామ్మ.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..