శ్రీశైలంలో సాంప్రదాయ బద్ధంగా గిరి ప్రదక్షిణ, అమ్మవారికి లక్ష కుంకుమార్చన..

శ్రీశైలంలో సాంప్రదాయ బద్ధంగా గిరి ప్రదక్షిణ, అమ్మవారికి లక్ష కుంకుమార్చన..

J Y Nagi Reddy

| Edited By: Srikar T

Updated on: Mar 25, 2024 | 12:51 PM

నంద్యాల జిల్లా శ్రీశైలంలో పాల్గుణ శుద్ద పౌర్ణమి కావడంతో శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవారి శ్రీశైల గిరిప్రదక్షిణ కార్యక్రమాన్ని దేవస్థానం ఘనంగా నిర్వహించింది. సాయంత్రం స్వామి అమ్మవార్ల మహామంగళ హారతుల అనంతరం ఉత్సవమూర్తులను పల్లకీలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

నంద్యాల జిల్లా శ్రీశైలంలో పాల్గుణ శుద్ద పౌర్ణమి కావడంతో శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవారి శ్రీశైల గిరిప్రదక్షిణ కార్యక్రమాన్ని దేవస్థానం ఘనంగా నిర్వహించింది. సాయంత్రం స్వామి అమ్మవార్ల మహామంగళ హారతుల అనంతరం ఉత్సవమూర్తులను పల్లకీలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ధర్మప్రచార రథంలో ఊరేగింపుగా గిరిప్రదక్షిణ కార్యక్రమాన్ని ఆలయ ఏఈవో హరిదాస్ అర్చకులు ప్రారంభించారు. ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమం ఆలయ రాజగోపురం నుంచి ప్రారంభమై గంగాధర మండపము, ఆంకాళమ్మ ఆలయం, నందిమండపము, గంగాసదనము, బయలు వీరభద్రస్వామి ఆలయం పంచమఠాలు, మల్లమ్మ కన్నీరు పుష్కరిణి వద్దకు చేరుకొని తిరిగి నంది మండపము మీదుగా ఆలయ మహద్వారములోకి చేరుకోవడంతో శ్రీశైల గిరిప్రదక్షిణ కార్యక్రమం ముగిసింది.

క్షేత్రాన్ని ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దడంలో భాగంగా గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని నిర్వహిస్తునట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ గిరి ప్రదక్షిణలో వందలాది మంది భక్తులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. గిరి ప్రదక్షిణ ముగిసిన అనంతరం పాల్గుణ పౌర్ణమి సందర్భంగా శ్రీభ్రమరాంబికాదేవి అమ్మవారికి లక్ష కుంకుమార్చన నిర్వహించారు. ఈ లక్ష కుంకుమార్చనలో భక్తులు పరోక్షసేవగా కూడా పాల్గొనే అవకాశం దేవస్థానం కల్పించింది. ఈ లక్ష కుంకుమార్చనలో ముందుగా పూజాసంకల్పం కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతి పూజను చేసి ఇతర పూజకైకర్యాలు నిర్వహించారు ఆలయ అధికారులు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..