Indian Navy: 35 మంది సముద్రపు దొంగలను పట్టుకున్న మన నేవీ.. వీడియో ఇదిగో.!
అరేబియా సముద్రంలో సాహసోపేతంగా వ్యవహరించి, సోమాలియా సముద్రపు దొంగల ఆటకట్టించిన భారత నౌకాదళం.. అరేబియా సముద్రం నుంచి 35 మంది ముష్కరులను శనివారం ముంబయికి తీసుకువచ్చింది. ‘ఆపరేషన్ సంకల్ప్’ను చేపట్టిన నౌకాదళం.. ఐఎన్‌ఎస్ కోల్‌కతా యుద్ధనౌకలో వీరిని తీసుకువచ్చి ముంబై పోలీసులకు అప్పగించింది. అంతర్జాతీయ పైరసీ నిరోధక చట్టం-2022 కింద వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపింది.
అరేబియా సముద్రంలో సాహసోపేతంగా వ్యవహరించి, సోమాలియా సముద్రపు దొంగల ఆటకట్టించిన భారత నౌకాదళం.. అరేబియా సముద్రం నుంచి 35 మంది ముష్కరులను శనివారం ముంబయికి తీసుకువచ్చింది. ‘ఆపరేషన్ సంకల్ప్’ను చేపట్టిన నౌకాదళం.. ఐఎన్‌ఎస్ కోల్‌కతా యుద్ధనౌకలో వీరిని తీసుకువచ్చి ముంబై పోలీసులకు అప్పగించింది. అంతర్జాతీయ పైరసీ నిరోధక చట్టం-2022 కింద వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపింది. అరేబియా సముద్రంలో మోహరించిన ఐఎన్‌ఎస్ కోల్‌కతా నౌక మార్చి 15న ఎం.వి.రుయెన్ నౌకను రక్షించింది. గతేడాది డిసెంబర్ 14న హిందూ మహాసముద్రంలో సోమాలియా సముద్రపు దొంగలు రెచ్చిపోయారు. బంగ్లాదేశ్ జెండాతో ఉన్న ఓ కార్గో నౌకను హైజాక్ చేశారు. ఆయుధాలతో సిబ్బందిని బెదిరించి నౌకను తమ నియంత్రణలోకి తీసుకున్నారు. ఎంవీ రుయెన్ నౌక నుంచి వచ్చిన అత్యవసర సందేశంపై మన నౌకాదళం స్పందించింది. డ్రోన్ ద్వారా ఎంవీ రూయెన్‌లో సాయుధ సముద్రపు దొంగల ఉనికిని ఐఎన్ఎస్ కోల్‌కతా గుర్తించింది. సీ-17 విమానం ద్వారా కమాండోలను ఎంవీ రుయెన్‌లోకి జారవిడిచింది. ఈ చర్య కారణంగా సముద్రపు దొంగలు ఓడను ఆపవలసి వచ్చింది. ఈ క్రమంలో కొందరు పైరెట్లు ex-MV Ruen నౌక డెక్‌పైకి వచ్చి కాల్పులకు తెగబడ్డారు. వెంటనే లొంగిపోవాలని, ఎవరైనా పౌరులు బందీలుగా ఉంటే విడిచిపెట్టాలని కమాండోలు హెచ్చరించిట్లు భారత నేవీ పేర్కొంది. తాము సముద్ర భద్రతకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసినట్లు తెలిపింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.
ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.