లండన్‌లో రోడ్డు ప్ర‌మాదంలో భారత విద్యార్ధిని మృతి

లండన్‌లో రోడ్డు ప్ర‌మాదంలో భారత విద్యార్ధిని మృతి

Phani CH

|

Updated on: Mar 25, 2024 | 10:10 PM

బ్రిటన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతీయ మహిళ చైస్తా కొచ్చర్ దుర్మరణం చెందారు. గతంలో నీతి ఆయోగ్ లో పనిచేసిన ఆమె లండన్‌ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్‌లో పీహెచ్‌డీ చేస్తున్నారు. మార్చి 19న భర్తతో కలిసి సైక్లింగ్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. భర్త ముందు వెళుతుండగా మరో సైకిల్‌పై వెళుతున్న చైస్తాను చెత్త తరలించే ట్రక్కు ఢీకొట్టింది. ఆ సమయంలో ఆమె భర్త ప్రశాంత్‌ కొంత దూరంలోనే ఉన్నారు.

బ్రిటన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతీయ మహిళ చైస్తా కొచ్చర్ దుర్మరణం చెందారు. గతంలో నీతి ఆయోగ్ లో పనిచేసిన ఆమె లండన్‌ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్‌లో పీహెచ్‌డీ చేస్తున్నారు. మార్చి 19న భర్తతో కలిసి సైక్లింగ్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. భర్త ముందు వెళుతుండగా మరో సైకిల్‌పై వెళుతున్న చైస్తాను చెత్త తరలించే ట్రక్కు ఢీకొట్టింది. ఆ సమయంలో ఆమె భర్త ప్రశాంత్‌ కొంత దూరంలోనే ఉన్నారు. వెంటనే వచ్చి ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేయగా.. అప్పటికే మృతి చెందారు. చైస్తా మృతిపై నీతి ఆయోగ్ మాజీ సీఈఓ అమితాబ్ కాంత్ విచారం వ్యక్తం చేశారు. నీతి ఆయోగ్ లోని లైఫ్ ప్రోగ్రామ్‌లో ఆమె పనిచేసినట్టు తెలిపారు. చాలా తెలివైన వ్యక్తి. ధైర్యవంతురాలు. చాలా త్వరగా మనల్ని విడిచి వెళ్లిపోయారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను అంటూ అమితాబ్‌ కాంత్‌ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

శ్రీశైలంలో వైభవంగా శ్రీగిరి ప్రదక్షిణ.. అమ్మవారికి లక్షకుంకుమార్చన

రాజమండ్రి గామన్‌ బ్రిడ్జికి ఏమైంది ??

తెలంగాణలో వచ్చే 5 రోజుల్లో మండిపోనున్న ఎండలు

పవర్ స్టార్ కూతురు క్యూట్ వీడియోకు సోషల్ మీడియా ఫిదా..

గుడ్ న్యూస్.. రంగస్థలం 2 స్పెషల్ సర్‌ప్రైజ్‌