KTR – Harish Rao: ఒకే కారులో బావాబామ్మర్దులు.. కేటీఆర్ డ్రైవింగ్.. ఆసక్తికర ఫొటోలను షేర్ చేసిన హరీష్ రావు..

శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌కు వచ్చిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఎట్ హోం కార్యక్రమం శుక్రవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు కొనసాగనుంది.

KTR - Harish Rao: ఒకే కారులో బావాబామ్మర్దులు.. కేటీఆర్ డ్రైవింగ్.. ఆసక్తికర ఫొటోలను షేర్ చేసిన హరీష్ రావు..
KTR - Harish Rao
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 22, 2023 | 5:12 PM

శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌కు వచ్చిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఎట్ హోం కార్యక్రమం శుక్రవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు కొనసాగనుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బొల్లారంలోని శీతాకాల విడిది భవన ప్రాంగణంలో జరిగే ఈ కార్యక్రమానికి అధికార పార్టీతోపాటు.. విపక్ష పార్టీ ప్రజాప్రతినిధులకు ఆహ్వానం అందింది. దీనిలో భాగంగా బీఆర్ఎస్ అగ్రనేతలు.. బావాబామ్మర్దులు.. హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరూ బొల్లారం బయలు దేరారు. తెలంగాణ భవన్ నుంచి ఇద్దరూ ఒకే కారులో ప్రయాణించారు. కేటీఆర్ స్వయంగా డ్రైవింగ్ చేస్తుండగా.. హరీష్ రావు ఆయన పక్కన కూర్చొని కనిపించారు.

ఈ ఫొటోలను హరీశ్‌ రావు తన ఎక్స్ (ట్విట్టర్‌) ఖాతాలో పోస్ట్ చేయగా.. ఇవి వైరల్ గా మారాయి. కాగా.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సర్జరీ తర్వాత.. బీఆర్ఎస్ పార్టీని నడిపించే బాధ్యతను కేటీఆర్, హరీష్ రావు తీసుకున్నారు. ఇద్దరూ వరుసగా సమావేశాల్లో పాల్గొంటూ.. పార్టీ కేడర్ కు దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరూ ఒకే కారులో ప్రయాణించడం ప్రధాన్యత సంతరించుకుంది.

హరీష్ రావు ట్వీట్..

అయితే, ఇద్దరినీ ఒకే ఫ్రేమ్‌లో చూడటం ఎంతో సంతోషంగా ఉందని బీఆర్ఎస్ కార్యకర్తలు, ఫాలోవర్లు ఎక్స్ లో కామెంట్స్ చేస్తున్నారు.. కదనరంగంలోకి కృష్ణార్జులు అంటూ ఓ అభిమాని కామెంట్ చేయగా.. మరొకరు మీరే మాకు పెద్ద దిక్కు అంటూ రీట్విట్ చేశారు.

ట్రాఫిక్ ఆంక్షలు..

కాగా.. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోం కార్యక్రమం దృష్ట్యా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ లోతుకుంట, టి.జంక్షన్, ఎంసీఈఎంఈ సిగ్నల్, లాల్ బజార్, టి.జంక్షన్, తిరుమలగిరి ఎక్స్‌రోడ్స్, సికింద్రాబాద్ క్లబ్‌ఇన్ గేట్, టివోలి కూడలి, ప్లాజా ఎక్స్ రోడ్, సీటీఓ, ఎస్‌బీఐ జంక్షన్, రసూల్‌పుర, పీఎన్‌టీ పైవంతెన, గ్రీన్‌‌ల్యాండ్, మొనప్ప కూడలి, ఖైరతాబాద్ వీవీ విగ్రహం జంక్షన్ వద్ద, పంజాగుట్ట, ఎన్ఎఫ్‌సీఎల్ ఎన్టీఆర్ భవన్, జూబ్లీహిల్స్ చెక్ పోస్టుల వద్ద ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..