AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: 24 గంటల్లో మంత్రి సమాధానం చెప్పాలి.. లేదంటే..! కొండా సురేఖకు కేటీఆర్‌ లీగల్ నోటీస్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి కొండా సురేఖ మధ్య చిచ్చు మరింత రాజుకుంటుంది. ఫోన్‌ ట్యాపింగ్‌, నాగార్జున కుటుంబ విషయంపై కొండా సురేఖ అసత్య ఆరోపణలు చేశారంటూ కేటీఆర్ మండిపడ్డారు.

Telangana: 24 గంటల్లో మంత్రి సమాధానం చెప్పాలి.. లేదంటే..! కొండా సురేఖకు కేటీఆర్‌ లీగల్ నోటీస్
Konda Surekha Ktr
Balaraju Goud
|

Updated on: Oct 02, 2024 | 11:18 PM

Share

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి కొండా సురేఖ మధ్య చిచ్చు మరింత రాజుకుంటుంది. ఫోన్‌ ట్యాపింగ్‌, నాగార్జున కుటుంబ విషయంపై కొండా సురేఖ అసత్య ఆరోపణలు చేశారంటూ కేటీఆర్ మండిపడ్డారు. ఏకంగా లీగల్ నోటీసులు పంపారు. కొండా సురేఖ బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు.

ఫోన్ ట్యాపింగ్ నాగచైతన్య, సమంతలపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఆమె వ్యాఖ్యలను అక్కినేని నాగార్జున, అమల, నాగచైతన్య, సమంత సహా పలువురు సినీ ప్రముఖులు తీవ్రంగా ఖండించారు. సురేఖపై చర్యలు తీసుకోవాలంటూ రాహుల్ గాంధీకి అమల ఫిర్యాదు చేశారు. మరోవైపు కేటీఆర్‌ కూడా కొండా సురేఖ మాటలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో లీగల్‌ నోటీసును పంపించారు. కేవలం రాజకీయ కక్షతోనే, రాజకీయాల ప్రయోజనం కోసమే తన పేరును వాడుకుంటున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ఒక మహిళ అయి ఉండి ఇంకో మహిళ పేరును, సినిమా పేరును వాడుకొన వారి వ్యక్తిక్త హనానికి పాల్పడటం దురదృష్టకరమన్నారు. అసలు తనకు సంబంధమే లేని అంశాలపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు అసత్యమైవంటూలీగల్ నోటీసులో పేర్కొన్నారు.

కేటీఆర్ మంత్రిగా పనిచేస్తున్న కాలంలో ఫోన్ టాపింగ్ చేశారంటూ సురేఖ చేసిన వ్యాఖ్యలతో పాటు, నాగచైతన్య సమంత విడిపోవడానికి ప్రధాన కారణం కేటీఆర్ అంటూ కొన్ని దుర్వేశపూర్వక వ్యాఖ్యలు చేశారు కొండా సురేఖ. దీంతో కేవలం తన గౌరవానికి భంగం కలిగించాలన్న ఉద్దేశ్యంతోనే కొండ సురేఖ అడ్డగోలుగా మాట్లాడుతున్నారని లీగల్ నోటీసులో కేటీఆర్ పేర్కొన్నారు. ఒక మంత్రిగా కొండా సురేఖ తన మంత్రి హోదాను దుర్వినియోగం చేశారన్నారు. ఎలాంటి సాక్షాలు లేకుండా కొండా సురేఖ చేసిన అసత్య పూరిత వ్యాఖ్యలు, దురుద్దేశ పూరిత మాటలు మీడియా, సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచురితం అయ్యాయన్నారు.

ఎలాంటి సాక్షాదారాలు చూపించకుండా అడ్డగోలుగా మాట్లాడిన కొండ సురేఖ ఒక మంత్రి అని, ఆమె చేసిన వ్యాఖ్యలను సాధారణ ప్రజలు నిజాలుగా భ్రమపడేఅవకాశం ఉందని కేటీఆర్ పంపిన లీగల్ నోటీసులు పేర్కొన్నారు. ఒక మంత్రిగా తన సహచర అసెంబ్లీ సభ్యుడు అని సోయి కూడా లేకుండా కొండా సురేఖ మాట్లాడడం ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. గతంలో ఇవే అడ్డగోలు మాటలు మాట్లాడిన కొండా సురేఖకు ఈ సంవత్సరం నాలుగవ నెలలో నోటీసులు పంపించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇలాంటి అవాంఛనీయ వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖకు భారత ఎన్నికల సంఘం గట్టి హెచ్చరిక చేసిందని అయినా ఇలాంటి దురుద్దేశపూర్వక ఒక వ్యాఖ్యలను కొనసాగిస్తున్నరన్నారు

కొండ సురేఖ ప్రణాళికబద్ధంగా కావాలనే పదేపదే అవే అబద్దాలను తన వ్యక్తిత్వాన్ని తగ్గించడం కోసం, నష్టపరచడం కోసం చేస్తుందన్నారు. కొండా సురేఖ ఈరోజు చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని తన లీగల్ నోటీసులు డిమాండ్ చేశారు. దీంతోపాటు అబద్దాలు, అసత్యాలు దురుద్దేశపూర్వకంగా మాట్లాడినందుకు బహిరంగ క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. భవిష్యత్తులోనూ ఇలాంటి దురుద్దేశపూర్వక, చిల్లర మాటలు మాట్లాడవద్దని సూచించారు. 24 గంటల్లోగా కొండా సురేఖ క్షమాపణ చెప్పకుంటే చట్ట ప్రకారం పరువు నష్టం దావాను వేయడంతో పాటు క్రిమినల్ కేసులను కూడా వేస్తానని హెచ్చరించారు.

Legal Notice

Legal Notice

Legal Notice 2

Legal Notice 2

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..