KTR: ‘కాంగ్రెస్ తెచ్చిన కరువు’.. బడ్జెట్ వేళ ఎండిన వరికంకులతో బీఆర్‌ఎస్ నిరసనబాట..
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరిపంట ఎండిపోతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. రైతాంగానికి సాగు నీరు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ ఎండిన వరిపంటను ప్రదర్శిస్తూ బీఆర్‌ఎస్ సభ్యులు అసెంబ్లీ, మండలికి వచ్చారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా వరిపంట ఎండుతోందని..రైతాంగానికి సాగు నీరు అందించడంలో ప్రభుత్వం విఫలమైందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరిపంట ఎండిపోతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. రైతాంగానికి సాగు నీరు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ ఎండిన వరిపంటను ప్రదర్శిస్తూ బీఆర్‌ఎస్ సభ్యులు అసెంబ్లీ, మండలికి వచ్చారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా వరిపంట ఎండుతోందని..రైతాంగానికి సాగు నీరు అందించడంలో ప్రభుత్వం విఫలమైందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటూ పేర్కొన్నారు. రైతులు ఆత్మహత్య చేసుకుంటే అందాల పోటీలా అంటూ ప్రశ్నించారు. ఈ సందర్భంగా అసెంబ్లీ మీడియా పాయింట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పంటలు ఎండుతున్నయంటే.. ముందుచూపు లేని ప్రభుత్వమే కారణమన్నారు. రైతుల పట్ల, రైతాంగం పట్ల ప్రభుత్వం తన బాధ్యత మర్చిపోయింది కాబట్టే పంటలు ఎండిపోతున్నాయని పేర్కొన్నారు. ఎండిపోయిన ప్రతి ఎకరానికి రూ. 25 వేల రూపాయల చొప్పున పంటల పరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు రైతన్నలకు నష్టపరిహారం ఇచ్చేందుకు ఈ బడ్జెట్ లోనే నిధులను కేటాయించాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ నిర్లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా వరిపంట ఎండుతోందని.. సాగు నీరు అందించడంలో ప్రభుత్వం విఫలం అయిందంటూ కేటీఆర్ పేర్కొన్నారు. ఇటు నీరు లేక పంటలు పండక.. అటు రుణ మాఫీ జరగక, రైతుబంధు రాక రైతులు ఇబ్బందులు పడుతున్నారంటూ పేర్కొన్నారు. గతంలో ఎండని పంటలు ఈరోజు ఎందుకు ఎండిపోతున్నాయని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
ఎండిపోయిన పంటల అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు రైతులకు అండగా భరోసాగా ఉండేందుకు ఆయా ప్రాంతాల్లో తమ పార్టీ పర్యటిస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
