Telangana: కరీంనగర్‌లో బీఆర్‌ఎస్‌కి షాక్‌ల మీద షాక్‌.. అయోమయంలో క్యాడర్‌

గతంలో‌ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ కరీంనగర్‌ జిల్లా వ్యాప్తంగా గులాబీ పార్టీ అనుకూల ఫలితాలు సాధించింది. తెలంగాణ ‌ఉద్యమ సమయంలొ జరిగిన ఉప ఎన్నికలలో గులాబి‌జెండా రెపరెపలాడింది...తెలంగాణ ఆవిర్భావం తరువాత జరిగిన‌ రెండు‌ అసెంబ్లీ ‌ఎన్నికలలో‌ క్లీన్‌స్వీప్ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలలో తొంభై ఐదు శాతానికి పైగా‌ ఫలితాలు‌..

Telangana: కరీంనగర్‌లో బీఆర్‌ఎస్‌కి షాక్‌ల మీద షాక్‌.. అయోమయంలో క్యాడర్‌
BRS Party
Follow us

| Edited By: Narender Vaitla

Updated on: Jun 11, 2024 | 9:28 AM

కరీంనగర్ బీఆర్‌ఎస్‌కి కంచుకోట. టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి ప్రతి‌ ఎన్నికలో సత్తా చాటింది…అంతే కాకుండా కరీంనగర్‌ని, బీఆర్‌ఎస్‌ను విడదీయలేని పరిస్థితి. ఇక్కడ నెగ్గితే తెలంగాణ అంతా పాజిటివ్ ఫలితాలు వస్తాయనే సెంటిమెట్ ఉంది. 2019 ఎన్నికల‌ నుంచి బీఆర్‌ఎస్‌ కంచుకోటకి బీటలు వారుతున్నాయి. తాజాగా జరిగిన పార్లమెంటు ఎన్నికలలొ కనీసం పోటీ కూడా ఇవ్వకుండా మూడవ స్థానానికే పరిమితం కావడం గమనార్హం.

గతంలో‌ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ కరీంనగర్‌ జిల్లా వ్యాప్తంగా గులాబీ పార్టీ అనుకూల ఫలితాలు సాధించింది. తెలంగాణ ‌ఉద్యమ సమయంలొ జరిగిన ఉప ఎన్నికలలో గులాబి‌జెండా రెపరెపలాడింది…తెలంగాణ ఆవిర్భావం తరువాత జరిగిన‌ రెండు‌ అసెంబ్లీ ‌ఎన్నికలలో‌ క్లీన్‌స్వీప్ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలలో తొంభై ఐదు శాతానికి పైగా‌ ఫలితాలు‌ సాధించింది. ఈ‌జిల్లాలొ బీఆర్‌ఎస్‌కు ఇక తిరుగులేదన్న సమయంలో‌ 2019 ఎన్నికలలో బిఅర్ఎస్ కి మొదటిషాక్ తగిలింది. తరువాత 2023 అసెంబ్లీ ఎన్నికలలో అనుకూలమైనా ఫలితాలు సాధించలేక పోయింది. కనీసం ఎంపి ఎన్నికలలొ గట్టి పోటి ఇస్తామని నేతలు భావించారు, ఈ ఎన్నికలతొ పార్టీ బలోపేతం అవుతుందని అంచనాలు వేసుకున్నారు. పోటి మాట ఏమో గాని మూడవస్థానానికే పరిమితమై బిఅర్ఎస్ శ్రేణులను తీవ్ర నిరాశకి గురి చేసింది.

రాష్ట్రంలో ‌ఒకటో రెండో సీట్లు బిఅర్ఎస్ ‌గెలిస్తే అది‌ కరీంనగర్‌లోనే గెలుస్తుందని నేతలు భావించారు. కానీ వ్యతిరేక ఫలితాలు వచ్చాయి…ఇక్కడ పార్టీ గట్టిగా ఉన్న కనీసం రెండవ స్థానంలో కూడా నిలబడలేదు. కరీంనగర్ పార్లమెంటు ‌ఫరిధిలో ఏడు అసెంబ్లీలలో‌ ఎక్కడ కూడా లిడ్ ఇవ్వలేక పోయింది….బిఅర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఅర్ ప్రాతినిథ్యం వహిస్తున్న సిరిసిల్లలో కూడా లీడ్ ఇవ్వలేక పోయింది. ఇక్కడ మాత్రం రెండవస్థానంలో నిలిచింది..మరో మాజీ మంత్రి గంగుల కమలాకర్ ప్రాతినిథ్యం వహిస్తున్న కరీంనగర్ ‌అసెంబ్లీలొ కనీస ఓట్లు కూడా సాధించలేక పోయింది…మూడవస్థానానికే పరిమితం అయ్యింది కరీంనగర్ అసెంబ్లీలో.

బిఅర్ఎస్ ఎమ్మెల్యే ఉన్న హుజురాబాద్ లో‌కూడా మూడవస్థానానికే పరిమితం అయ్యింది. ఒకప్పుడు క్యాడర్,లీడర్ లతో బలంగా‌ ఉన్న బిఅర్ఎస్ ఇప్పుడు మూడవస్థానానికే పరిమితం ‌కావడంతో క్యాడర్ ‌అంతా‌ అయోమయానికి గురి అవుతుంది. అయితే ఇది తాత్కలిక‌ అపజయమే అని,స్థానిక ‌సంస్థల ఎన్నికలలో‌ సత్తా ఏమిటో‌ చూపిస్తామని బిఅర్ఎస్ నేతలు అంటున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
వెలుగులోకి మరో లోన్ యాప్ స్కామ్.. మహిళను వేధిస్తున్న కేటుగాళ్లు
వెలుగులోకి మరో లోన్ యాప్ స్కామ్.. మహిళను వేధిస్తున్న కేటుగాళ్లు
టమాటాలు అతిగా తిన్నారో మీ పని అంతే..! తస్మాత్‌ జాగ్రత్త
టమాటాలు అతిగా తిన్నారో మీ పని అంతే..! తస్మాత్‌ జాగ్రత్త