AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: పెన్షన్ డబ్బుల కోసం దారుణం.. బామ్మర్ది హత్యకు మాస్టర్ ప్లాన్.. కట్‌చేస్తే..

సమాజంలో మానవత్వం మంటగలిసి పోతుంది. నా అనేవాళ్ళే డబ్బుల కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. పెన్షన్ డబ్బుల కోసం సొంత బామ్మర్దినే చంపేందుకు ప్రయత్నించాడు ఓ ప్రబుద్ధుడు. హైదరాబాద్ నగరంలోని ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం చోటు చేసుకుంది.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Telangana: పెన్షన్ డబ్బుల కోసం దారుణం.. బామ్మర్ది హత్యకు మాస్టర్ ప్లాన్.. కట్‌చేస్తే..
Crime
Noor Mohammed Shaik
| Edited By: |

Updated on: Apr 17, 2025 | 9:32 PM

Share

మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సొంత బామ్మర్దిని హత్య చేసేందుకు కుట్ర చేసిన బావ బండారం బయటపడింది. కొందరు మైనర్ యువకులతో రిక్కీ నిర్వహిస్తూ అడ్డంగా దొరికిపోయాడు ఆ బావ. అంకుశాపూర్ గ్రామానికి చెందిన పెంటయ్య.. తన కూతురు లావణ్యను మసీదు బండ ప్రాంతానికి చెందిన శ్రీనివాస్ అనే యువకుడితో వివాహం జరిపించాడు. రిటైర్డ్ ఉద్యోగి అయిన పెంటయ్య తన కూతురు లావణ్యకు పెన్షన్ డబ్బులు ఇవ్వడానికి నిరాకరించాడు. దీంతో డబ్బులు ఎందుకు ఇవ్వరంటూ లావణ్య భర్త శ్రీనివాస్ గొడవకు దిగాడు. ఈ క్రమంలో గొడవను నిలువరించడానికి లావణ్య తమ్ముడు ఈశ్వర్ బావ శ్రీనివాస్ తో వాగ్వాదానికి దిగాడు. దీంతో వాదన కాస్తా తీవ్ర రూపం దాల్చి ఒకరిపై ఒకరు దాడి చేసుకునేవరకూ వచ్చింది. బావని అయిన తన మీదే బామ్మర్ది ఈశ్వర్ దాడి చేస్తాడా అని శ్రీనివాస్ కక్ష పెంచుకున్నాడు. దీంతో ఎలాగైనా తన మామ పెంటయ్య ఆస్తి 3 ఎకరాలను కొట్టేయడంతో పాటు బామ్మర్దిని చంపడమే లక్ష్యంగా ప్లాన్ చేసుకున్నారు.

ఈ మేరకు లావణ్య – శ్రీనివాస్ లు బామ్మర్దిని చంపించి, ఆస్తిని ఎలాగైనా కొట్టేయడానికి మైనర్లకు సుపారీ ఇవ్వడానికి నిర్ణయించుకున్నారు. ఆస్తి కొట్టేయాలనే ఉద్దేశ్యంతో సొంత తమ్ముడిని కూడా చంపడానికి లావణ్య, బామ్మర్ది ప్రాణం తీయడానికి శ్రీనివాస్ ఘోరానికి పాల్పడ్డారు. ఈ క్రమంలోనే మైనర్లకు సుపారీ ఇచ్చి రిక్కీ నిర్వహిస్తూ అడ్డంగా దొరికిపోయారు. అనుమానాస్పదంగా కనిపించిన మైనర్లను విచారించగా.. శ్రీనివాస్ అతని భార్య లావణ్యల బండారం బయటపడింది. ఇంత దారుణానికి పాల్పడాలని చూసిన ఆ ఇద్దరిపై ఈశ్వర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీనివాస్ అతని భార్య లావణ్య, చంపడానికి ఒప్పుకున్న ఆ ముగ్గురు మైనర్లు పోలీసుల అదుపులో ఉన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా