Telangana: రూ.2 వేల కోసం అన్నదమ్ముళ్ల మధ్య కొట్లాట.. గొడవను ఆపేందుకు వచ్చిన బావ.. చివరికి
డబ్బుల వల్ల జరిగే అనేక గొడవలు జరుగుతుంటాయి. అప్పుల విషయంలో గాని, ఆస్తుల విషయంలో గాని ఇలా డబ్బులకి సంబంధించి అనేక సందర్భాలు గొడవలకు దారితీస్తుంటాయి. తాజాగా జగిత్యాలలోని విజయపురి కాలనీలో దారుణం జరిగింది. 2 వేల రూపాయల పింఛన్ కోసం ఇద్దరు అన్నదమ్ములు గొడవపడటంతో మరొకరు ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపుతోంది.

డబ్బుల వల్ల జరిగే అనేక గొడవలు జరుగుతుంటాయి. అప్పుల విషయంలో గాని, ఆస్తుల విషయంలో గాని ఇలా డబ్బులకి సంబంధించి అనేక సందర్భాలు గొడవలకు దారితీస్తుంటాయి. తాజాగా జగిత్యాలలోని విజయపురి కాలనీలో దారుణం జరిగింది. 2 వేల రూపాయల పింఛన్ కోసం ఇద్దరు అన్నదమ్ములు గొడవపడటంతో మరొకరు ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే.. విజయపూరికి చెందిన ఇద్దరు అన్నదమ్ముళ్లు రూ. 2 వేల పింఛను కోసం గొడవ పడ్డారు.
అయితే ఈ అన్నదమ్ముళ్లు మధ్య గొడవ జరుగుతుండగా దీన్ని ఆపేందుకు వాళ్ల బావ వచ్చాడు. సోదరులిద్దరూ ఒకరినొకరు కొట్టుకుంటుండగా, బావ తలకు కూడా తీవ్ర గాయమైంది. దీంతో వాళ్ల బావ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. అక్కడి పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ ఇద్దరు అన్నదమ్ముళ్లపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గొడవను ఆపేందుకు వెళ్లి మధ్యలో చనిపోయిన మృతిడి నివాసంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..