Telangana: అద్భత పుష్పం.. దర్శించుకునేందుకు క్యూ కట్టిన జనం
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా బ్రహ్మ కమలాల జాతర కొనసాగుతోంది. ఏడాదికి ఒకసారి మాత్రమే పూసే అద్బుత పుష్పం బ్రహ్మ కమలం వికసించడంతో ప్రత్యేక పూజలు చేస్తున్నారు భక్తులు. లక్షేట్టిపేట, ఖానాపూర్ , బైంసా, ఆదిలాబాద్ ఇలా అనేక చోట్ల ఒకే రోజు ఒకే సమయానికి బ్రహ్మ కమలం వికసించడంతో అద్భుతంగా భావిస్తున్నారు జిల్లా వాసులు. శ్రావణ మాస చివరి వారం కావడంతో మరింత ప్రత్యేత చాటుకుంది. బ్రహ్మ కమలం వికసించిన ఇంటి వద్దకు చేరుకుంటున్న కాలనీ వాసులు మంగళ హారతులతో కుంకుమార్చనలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా బ్రహ్మ కమలాల జాతర కొనసాగుతోంది. ఏడాదికి ఒకసారి మాత్రమే పూసే అద్బుత పుష్పం బ్రహ్మ కమలం వికసించడంతో ప్రత్యేక పూజలు చేస్తున్నారు భక్తులు. లక్షేట్టిపేట, ఖానాపూర్ , బైంసా, ఆదిలాబాద్ ఇలా అనేక చోట్ల ఒకే రోజు ఒకే సమయానికి బ్రహ్మ కమలం వికసించడంతో అద్భుతంగా భావిస్తున్నారు జిల్లా వాసులు. శ్రావణ మాస చివరి వారం కావడంతో మరింత ప్రత్యేత చాటుకుంది. బ్రహ్మ కమలం వికసించిన ఇంటి వద్దకు చేరుకుంటున్న కాలనీ వాసులు మంగళ హారతులతో కుంకుమార్చనలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మ కమలంపై బ్రహ్మదేవుడు కూర్చుని ఉంటాడని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఆయుర్వేదం ప్రకారం ఈ మొక్కను పక్షవాతానికి, మెదడు సంబంధిత వ్యాధులకు వాడతారని సమాచారం.
బ్రహ్మ కమలం శాస్త్రీయ నామం Saussurea obvallata. ఈ పుష్పం ప్రత్యేకంగా హిమాలయ పర్వతాల సమీపంలో.. అటు ఉత్తర ప్రదేశ్, ఉత్తర బర్మా, టిబెట్, నేపాల్, దక్షిణ చైనా దేశాలలో కనబడుతుంది. బ్రహ్మ కమలాన్ని ఉత్తరాఖండ్ జిల్లాలైన కేదార్‌నాథ్, హేమకుండ్ సాహిబ్ , తుంగనాథ్‌లలో ఎక్కువగా చూడవచ్చు. బ్రహ్మకమలం ఉత్తరాఖండ్ రాష్ట్రీయ పుష్పం కూడా. ఈ మొక్కను కింగ్ ఆప్ హిమాలయ ప్లవర్ అని కూడా అంటారు. ఈ మొక్క పై ఆకులే పువ్వుగా రూపాంతరం చెందడం దీని ప్రత్యేకత. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మున్సిపాలిటీ పరిదిలోని సత్య సాయి నగర్‌కు చెందిన బొద్దుల వెంకటేశం , గాంధీ నగర్‌కు చెందిన అంజన్న ఇంట్లో రాత్రి 9 గంటల సమయంలో ఒకేసారి బ్రహ్మ కమలం పుష్పం వికసించింది. అటు నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ కేంద్రంలోని టవర్స్ కాలనీలోని సుజాత జగదీశ్వర్ ఇంట్లో , భైంసా మండలం మహాగాం గ్రామానికి చెందిన విశ్వనాథ్ అనే వ్యక్తి ఇంట్లో బ్రహ్మ కమలం విరబుసింది. దీంతో కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు, కాలనీ వాసులు తండోపతండాలుగా తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
శ్రావణ చివరి సోమవారం కావడం ఏకకాలంలో అన్ని చోట్ల బ్రహ్మ కలం ఒకేసారి వికసించడంతో మంచి శుభపరిణామం అంటూ భావిస్తూ ఆడపడుచులు ప్రత్యేక పూజలు చేశారు. బ్రహ్మ కమలం అదృష్టానికి చిహ్నం అని.. హిమాలయాల్లో మాత్రమే కనిపించే ఈ పుష్పం ఏడాదికి ఒకసారి మాత్రమే వికసిస్తుందని.. ఈ పుష్పం వికసించిన ఇంట సిరిసంపదలు కలుగతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. కొన్ని గంటలు మాత్రమే వికసించి ఉండే పుష్పాన్ని కనులారా చూసి దర్శించుకునేందుకు జనం క్యూ కట్టడం కనిపించింది. హిందూ పురాణాలలో, ఇది విశ్వం యొక్క సృష్టికర్త అయిన బ్రహ్మ దేవునికి ఇష్టమైన పువ్వుగా చెప్పబడింది. అందుకే శ్రావణ మాసంలో వికసిస్తూ ప్రత్యేక పూజలందుకుంటోంది. కేవలం ఆధ్యాత్మికంగానే కాదు వ్యాధులను సైతం నయం చేసే శక్తి ఈ బ్రహ్మకమలానికి ఉందని సమాచారం.
బ్రహ్మ కమలం పుష్పం యాంటీ ఇన్ఫ్లమేటరీగా వాపును తగ్గించడానికి , నొప్పిని తగ్గించడానికి ..యాంటీఆక్సిడెంట్‌గా ఫ్రీ రాడికల్స్ యొక్క హానికరమైన ప్రభావాల నుండి శరీరాన్ని రక్షించడంలో సహాయపడుతుందని తెలుస్తోంది. శరీరానికి అంటువ్యాధులు దరిచేరకుండా సహాయపడుతుంది. శ్వాసకోశ సంబంధిత వ్యాధులను నయం చేయడంలో.. ఉబ్బసం , బ్రోన్కైటిస్ వంటి వ్యాధులను తగ్గించడంలో సహయలారిగా ఉండటం దీని గొప్ప లక్షణం. అందుకే ఈ పుష్పాలను భక్తితో పూజిస్తారు హిందువులు.




