AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: అమ్మో బాబోయ్ దడపుట్టిస్తున్న జ్వరాలు.. కిటకిటలాడుతున్న ఆస్పత్రులు

తెలంగాణలో జ్వరాలు దడపుట్టిస్తున్నాయి. ఒక్కసారిగా వాతావరణ మార్పులు రావడంతో జ్వరాల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. జ్వరం బాధితులతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. ఉదయం నుంచే ఆసుపత్రులకి జ్వరం బాధితులు క్యూలు కడుతున్న పరిస్థితి నెలకొంది. డెంగీతో పాటుగా.. మలేరియా, టైఫాయిడ్, అతిసారం లాంటి కేసులు ఎక్కువగా వస్తున్నాయి. ఆగస్టులో నమోదైనటువంటి కేసులతో పోల్చుకుంటే సెప్టెంబర్ 10వ తేదీ వరకు అమాంతంగా పెరిగిపోయాయి.

Telangana: అమ్మో బాబోయ్ దడపుట్టిస్తున్న జ్వరాలు..  కిటకిటలాడుతున్న ఆస్పత్రులు
Viral Fever
Aravind B
|

Updated on: Sep 12, 2023 | 8:40 AM

Share

తెలంగాణలో జ్వరాలు దడపుట్టిస్తున్నాయి. ఒక్కసారిగా వాతావరణ మార్పులు రావడంతో జ్వరాల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. జ్వరం బాధితులతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. ఉదయం నుంచే ఆసుపత్రులకి జ్వరం బాధితులు క్యూలు కడుతున్న పరిస్థితి నెలకొంది. డెంగీతో పాటుగా.. మలేరియా, టైఫాయిడ్, అతిసారం లాంటి కేసులు ఎక్కువగా వస్తున్నాయి. ఆగస్టులో నమోదైనటువంటి కేసులతో పోల్చుకుంటే సెప్టెంబర్ 10వ తేదీ వరకు అమాంతంగా పెరిగిపోయాయి. అలాగే రానున్న రోజుల్లో జ్వరా కేసులు మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వైద్య వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాల నుంచి బాధితుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇక ఆదిలాబాద్ , ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లోని కొన్ని మండలల్లో చూసుకుంటే గత నెల మొత్తంలో వచ్చిన కేసులు కేవలం ఈ నెల పది రోజుల్లోనే నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు తెలిపారు.

మరో విషయం ఏంటంటే ప్రతి వంద మందిలో 15 నుంచి 20 మంది దాకా వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నట్లుగా అంచనా వేస్తున్నాయి. శ్వాస సంబధిత సమస్యలు కూడా ఎక్కువగా నమోదవుతున్నాయి. అలాగే వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ప్రస్తుతం అక్కడ 154 మంది జ్వారానికి చికిత్స తీసుకుంటున్నారు. అయితే వీరిలో 17 మంది బాధితులే ఉన్నారు. అలాగే కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో రోజుకు 950 కేసుల దాకా ఓపీ కేసులు నమోదవుతున్నాయి. అయితే అందులో 350 నుంచి 400 మంది జ్వరంతోనే రావడం ఆందోళన కలిగిస్తోంది. ఇక ఆసిఫాబాద్ జిల్లాలో చూసుకుంటే ఈ నెలలో ఏకంగా 4,621 జ్వరం కేసులు నమోదయ్యాయి. అయితే ఇందలో ఎక్కువ శాతం మలేరియా కేసులు ఉన్నాయి. దీని తర్వాతి స్థానంలో టైఫాయిడ్ కేసులు ఉన్నాయి. మరోవైపు హైదరాబాద్‌లోని ఫీవర్ ఆసుపత్రి, గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో ఫీవర్ ఓపీల సంఖ్య గణనీయంగా పెరిగింది.

ఇదిలా ఉండగా.. గత కొన్ని రోజుల నుంచి జ్వరాల కేసులు బాగా పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా డెంగీ, టైఫాయిడ్, చికున్ గున్యా లాంటి కేసులు ఎక్కువగా వస్తున్నాయి. మరో విషయం ఏంటంటే కొంతమందిలో స్వైన్‌ప్లూ లక్షణాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే పిల్లలో ఆర్‌ఎస్‌వీ వైరస్ ఎక్కువగా పెరుగుతోంది. అయితే వైద్యులు మాత్రం జర్వం కేసులు పెరిగినంత మాత్రనా భయపడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. కానీ ప్రధానంగా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మాస్క్ ధరించాలని చెబుతున్నారు. ఒకవేళ జ్వరం రెండు, మూడు రోజుల తర్వతా కూడా తగ్గకుండే కచ్చితంగా వైద్యులను సంప్రదించాలని చెబుతున్నారు. అలాగే ఇంటి పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..