Praja Bhavan: “ప్రజా భవన్‌లో బాంబు పెట్టాం.. మరికాసేపట్లో పేలి పోతుంది..” బెదిరింపు కాల్ కలకలం..!
హైదరాబాద్ మహా నగరంలో బాంబు బెదిరింపు కాల్ కలకలం సృష్టించింది. ఏకంగా మాజీ సీఎం కేసీఆర్ క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్.. ప్రస్తుత ప్రజాభవన్‌లోనే బాంబు పెట్టామని అగంతకులు హెచ్చరించారు.
హైదరాబాద్ మహా నగరంలో బాంబు బెదిరింపు కాల్ కలకలం సృష్టించింది. ఏకంగా మాజీ సీఎం కేసీఆర్ క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్.. ప్రస్తుత ప్రజాభవన్‌లోనే బాంబు పెట్టామని అగంతకులు హెచ్చరించారు. మరికాసేపట్లో పేలి పోతుంది అంటూ పోలీస్ కంట్రోల్ రూమ్ కి అగంతకుడు ఫోన్ కాల్ చేశాడు. ప్రజా భవన్‌కు బాంబు బెదిరింపు కాల్ రావడంతో అప్రమత్తమైన పోలీసులు, బాంబ్ స్వ్కాడ్ బృందాలు హుటాహుటీన చేరుకుని తనిఖీలు చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడి తెలంగాణ డిప్యూటీ భట్టి విక్రమార్క నివాసం ఉంటున్నారు. బాంబు బెదిరంపుతో సిబ్బంది అప్రమత్తం అయ్యారు. సిబ్బంది సహా అందరినీ భవన్ నుంచి ఖాళీ చేయించి బాంబ్ స్క్వాడ్ తనిఖీలు జరుపుతోంది. మరోవైపు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఫోన్ చేసిన ఆగంతకుడిని ట్రేస్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..