AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: కెమెరాకి చిక్కిన నల్లటి ఆకారం.. ఏంటని చెక్ చేయగా గుండె గుభేల్.!

మెదక్ జిల్లాలో వింత సంఘటన ఎదురైంది. వైల్డ్ లైఫ్ అధికారులు అభయారణ్యంలో అన్ని చోట్లా కెమెరాలు పెట్టగా.. ఆర్ధరాత్రి వేళ మూడో కంటికి ఓ నల్లటి ఆకారం చిక్కింది. ఏమై ఉంటుందని పరీక్షించి చూడగా.. దెబ్బకు షాక్ అయ్యారు వైల్డ్ లైఫ్ అధికారులు. ఇంతకీ ఆ వివరాలు ఏంటి.? ఆ స్టోరీ ఏంటో తెలుసుకుందామా..

Telangana: కెమెరాకి చిక్కిన నల్లటి ఆకారం.. ఏంటని చెక్ చేయగా గుండె గుభేల్.!
Representative Image
P Shivteja
| Edited By: Ravi Kiran|

Updated on: Jan 17, 2024 | 5:38 PM

Share

మెదక్ జిల్లాలోని పోచారం అభయారణ్యాల్లో ప్రపంచంలోనే అతి చిన్న పిల్లి అయిన కుంచుతోక పిల్లి(నామాల పిల్లి)ని గుర్తించారు. దీని కోసం స్థానిక హవేలి ఘణపూర్ మండల పరిధిలోని 40 గ్రామాల్లో వీటి సంరక్షణ ప్రాజెక్టుకు నేతృత్వం వహిస్తున్న యానిమల్ వారియర్స్ కన్జర్వేషన్ సొసైటీ(ఏడబ్ల్యూసీఎస్) 15 కెమెరాలు ఏర్పాటు చేసి, సుమారు నాలుగు నెలల పాటు కష్టపడి ప్రతి రోజు కెమెరా స్థానాలను మార్చుకుంటూపోయారు. చివరికి బ్యాతొల్ అనే గ్రామ పరిసరాల్లో ఈ పిల్లి కెమెరా కంటికి చిక్కింది. ఈ పిల్లి జాతి మనుగడ రోజురోజుకూ తగ్గిపోతుంది. ఇది ఎక్కువగా చెట్లపైన నివసిస్తూ ఉంటుంది.

అయితే ఈ పిల్లి వల్ల రైతులకు ఎక్కువ లాభం ఉంటుందంటున్నారు వైల్డ్ లైఫ్ హెడ్ అమర్నాథ్ జక్కా. ఈ కుంచుతోక పిల్లి(నామాల పిల్లి) ఎక్కువగా ఎలుకలు, పాములు, బల్లులు, పురుగులను తింటుంది. పంట పొలాల వద్ద ఎలుకల బెడద వల్ల చాలా మంది రైతులు పంటను నష్టపోతారు. అలాంటి ప్రాంతంలో ఈ పిల్లి ఉంటే రైతులకు ఎంతో లాభం. ఆవాసాలను కోల్పోవడం వల్ల, భారతదేశంలో ఈ అడవి జాతికి చెందిన కుంచుతోక పిల్లుల సంఖ్య తగ్గిపోతోంది. ఈ పిల్లి భారత్, శ్రీలంక, నేపాల్ దేశాల్లో మాత్రమే కనిపిస్తుంది. సంరక్షణ పనుల్లో భాగంగా చిన్న పిల్లిని సంరక్షించాల్సిన ఆవశ్యకతపై గ్రామస్తులకు అవగాహన కల్పిస్తే మంచిదంటున్నారు వైల్డ్ లైఫ్ సిబ్బంది.

మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
రిచా ఘోష్ ఆన్ డ్యూటీ.. జీతం, బోనస్ కలిపి ఎంతోస్తాయో తెలుసా ?
రిచా ఘోష్ ఆన్ డ్యూటీ.. జీతం, బోనస్ కలిపి ఎంతోస్తాయో తెలుసా ?
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ