Bandi Sanjay: ప్రగతి భవన్‌లో అలజడి మొదలైంది.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తెలంగాణ వ్యతిరేకిగా చూపేందుకు, తెలంగాణ సెంటిమెంట్‌ను తిరిగి రెచ్చగొట్టేందుకు BRS ప్రయత్నిస్తోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ ఆరోపించారు. మోదీని చూస్తే కేసీఆర్‌ కుటుంబం గజగజ వణుకుతోందంటూ విమర్శలు గుప్పించారు. తెలంగాణపై మోదీ విషం చిమ్ముతున్నారని KTR అనవసర ఆరోపణలు చేస్తున్నారని ఈ సందర్భంగా బండి సంజయ్ మండిపడ్డారు.

Follow us
Shaik Madar Saheb

| Edited By: Phani CH

Updated on: Oct 04, 2023 | 2:41 PM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తెలంగాణ వ్యతిరేకిగా చూపేందుకు, తెలంగాణ సెంటిమెంట్‌ను తిరిగి రెచ్చగొట్టేందుకు BRS ప్రయత్నిస్తోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ ఆరోపించారు. మోదీని చూస్తే కేసీఆర్‌ కుటుంబం గజగజ వణుకుతోందంటూ విమర్శలు గుప్పించారు. తెలంగాణపై మోదీ విషం చిమ్ముతున్నారని KTR అనవసర ఆరోపణలు చేస్తున్నారని ఈ సందర్భంగా బండి సంజయ్ మండిపడ్డారు. ఈ మేరకు బండి సంజయ్ బుధవారం మీడియాతో మాట్లాడారు. నిన్న ప్రారంభించిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా విషం చిమ్మడమేనా అని ప్రశ్నించారు. అభివృద్ధి వ్యతిరేక పార్టీ BRS అంటూ బండి సంజయ్ ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీని టూరిస్టు అని KTR విమర్శించడాన్ని సంజయ్‌ తప్పుబట్టారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది కుటుంబం కోసమేనా అంటూ నిలదీశారు. కేసీఆర్‌ నిజస్వరూపాన్ని ప్రధాని మోదీ బట్టబయలు చేయడంతో ఇప్పుడు ప్రగతి భవన్‌లో అలజడి మొదలైందంటూ సంజయ్ పేర్కొన్నారు. BRSలో చీలిక తప్పదని, నిట్టనిలువున పార్టీ చీలుతుందని బండి సంజయ్‌ జోస్యం చెప్పారు.

ఇదిలాఉంటే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోడీ వరుస పర్యటనలు రాజకీయాలను మరింత హీటెక్కిస్తున్నాయి. నిజామాబాద్ సభలో ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్.. ఎన్డీఏలో చేరేందుకు ప్రయత్నించిందంటూ వ్యాఖ్యానించారు. దీనిపై అటు బీఆర్ఎస్.. ఇటు బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.. ఈ క్రమంలో కాంగ్రెస్ కూడా దీనిపై స్పందిస్తూ.. తాము చేసిన విమర్శలు కరెక్టేనంటూ అభిప్రాయపడుతోంది. ఇదే క్రమంలో మంత్రి కేటీఆర్.. బండి సంజయ్ మధ్య సోషల్ మీడియాలో వార్ మొదలైంది. ట్విట్టర్ వేదికగా ఇరువురు నేతలు ఘాటైన విమర్శలు చేసుకుంటున్నారు.

తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే రాజకీయం ఇలా ఉందంటే.. మున్ముందు మరింత హీటు ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోెసం ఇక్కడ క్లిక్ చేయండి..