AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మతాన్ని అవమానిస్తున్నారు.. వైన్స్ షాపులకు దేవుళ్ల పేర్లు తీసేయాలిః బీజేపీ ఎమ్మెల్యే ధన్‌పాల్‌

తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు అధికార విపక్షాల మధ్య వాడివేడిగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీకి చెందిన ఎమ్మెల్యే సరికొత్త డిమాండ్‌ను తెరపైకి తీసుకువచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ముందుకు బీజేపీ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ గుప్తా కొత్త ప్రతిపాదనలు తీసుకువచ్చారు.

మతాన్ని అవమానిస్తున్నారు.. వైన్స్ షాపులకు దేవుళ్ల పేర్లు తీసేయాలిః బీజేపీ ఎమ్మెల్యే ధన్‌పాల్‌
Bjp Mla Dhanpal Suryanarayana Gupta
Balaraju Goud
|

Updated on: Mar 26, 2026 | 1:27 PM

Share

తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు అధికార విపక్షాల మధ్య వాడివేడిగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీకి చెందిన ఎమ్మెల్యే సరికొత్త డిమాండ్‌ను తెరపైకి తీసుకువచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ముందుకు బీజేపీ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ గుప్తా కొత్త ప్రతిపాదనలు తీసుకువచ్చారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాలకు దేవుళ్ల పేర్లు తొలగించాలని డిమాండ్ చేశారు. మద్యం దుకాణాలకు దేవుళ్ల పేర్లు పెట్టకుండా కఠిన చట్టాలు తీసుకురావాలని అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హిందూ మతాన్ని అవమానిస్తూ.. వారి మనోభావాలను దెబ్బతీసేలా ఉన్న దేవుళ్ల పేర్లను వెంటనే తీసివేసేలా ఆదేశాలు ఇవ్వాలని ధన్‌పాల్‌ సూర్యనారాయణ ప్తా ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మద్యం దుకాణాలకు లైసెన్సులు ఇచ్చే సమయంలోనే దేవుళ్ల పేర్లతో పెట్టకుండా చర్యలు తీసుకోవాలని సూర్యనారాయణ గుప్తా ప్రభుత్వాన్ని కోరారు.

ఇదిలావుంటే ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా వేల సంఖ్యలో మద్యం దుకాణాలు ఉన్నాయి. అయితే ఈ మద్యం దుకాణాలకు వారి వారి ఇష్టమైన దేవుళ్ల పేర్లు పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. రేణుక ఎల్లమ్మ, మైసమ్మ తల్లి, శివ, వెంకటేశ్వర అంటూ రకరకాల హిందూ దేవుళ్ల పేర్లు పెట్టుకుని మద్యం దుకాణాలు నిర్వహిస్తున్నారు. హిందూ దేవుళ్ళ పేర్లు పెట్టుకుని మద్యం దుకాణాలను నడిపిస్తే మంచి గిరాకీ వస్తుందని మద్యం వ్యాపారుల నమ్మకం. అయితే ఇకపైన‌ మద్యం దుకాణాలకు దేవుళ్ల పేర్లు పెట్టకూడదని బీజేపీ కొత్త డిమాండ్ తెరపైకి తీసుకువచ్చింది.

వీడియో ఇక్కడ చూడండి..

ఇదిలావుంటే, ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని మద్యం దుకాణాలకు దేవుళ్లు, చారిత్రక ప్రముఖులు, కోటల పేర్లు పెట్టడాన్ని నిషేధించాలని నిర్ణయించింది. ఈ విషయానికి సంబంధించి ఎక్సైజ్ శాఖ త్వరలోనే ఒక నోటిఫికేషన్‌ను జారీ చేస్తుందని రాష్ట్ర కార్మిక శాఖ అధికారులు తెలిపారు. ఈ అంశం మార్చి నెలలో జరిగిన శాసన మండలి సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. . దీనిని పరిష్కరించేందుకు ఒక చట్టపరమైన నిబంధనను రూపొందించాలని డిమాండ్ వినిపించింది. ఈ నేపథ్యంలో, ఎక్సైజ్ శాఖ మంత్రి చంద్రశేఖర్ బావంకులే ఈ విషయంపై చర్చించేందుకు ఎక్సైజ్, కార్మిక శాఖల అధికారులతో ఒక సమావేశాన్ని నిర్వహించారు. తదనంతరం, ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకునేందుకు శాసన మండలి సభ్యులు, కార్మిక, ఎక్సైజ్ శాఖల అధికారులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us