మల్కాజ్‌గిరి స్థానం ఈసారి బీజేపీదే.. కాంగ్రెస్‌కు ఆ ఛాన్స్ లేదు.. ఈటెల షాకింగ్ కామెంట్స్..
లోక్‌సభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి అన్ని పార్టీలూ గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తూ.. ప్రజల్లోకి దూసుకుపోతున్నాయి. దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గమైన మల్కాజిగిరిపైన తెలంగాణలోని పార్టీలన్నీ ఫోకస్ పెట్టాయి. ఎలాగైనా మల్కాజిగిరి స్థానాన్ని గెలవాలని కసరత్తులు చేస్తున్నాయి. ఇప్పటికే మూడు ప్రధాన పార్టీలైన..

లోక్‌సభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి అన్ని పార్టీలూ గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తూ.. ప్రజల్లోకి దూసుకుపోతున్నాయి. దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గమైన మల్కాజిగిరిపైన తెలంగాణలోని పార్టీలన్నీ ఫోకస్ పెట్టాయి. ఎలాగైనా మల్కాజిగిరి స్థానాన్ని గెలవాలని కసరత్తులు చేస్తున్నాయి. ఇప్పటికే మూడు ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ తమ అభ్యర్థులను ప్రకటించేశాయి. ఎవరికివారు గెలుపు తమదేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం ఎప్పుడూ హాట్ సీటే. 2009 నుంచి ఇప్పటివరకు అన్ని పార్టీలు గెలుపు ధీమాను వ్యక్తం చేసినప్పటికీ.. రెండుసార్లు కాంగ్రెస్.. ఒకసారి టీడీపీకి మల్కాజిగిరి స్థానం దక్కింది.
2019 ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ గెలుపొందారు. ప్రస్తుతం ఆ సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకోవడమే ప్రధాన లక్ష్యంగా కాంగ్రెస్ ముందుకు వెళ్తోంది. ఇదే సమయంలో బీజేపీ పార్టీ నుంచి సీనియర్ నాయకుడు ఈటెల రాజేందర్ మల్కాజిగిరి నుంచి బరిలో నిలబడ్డారు. మల్కాజిగిరి స్థానాన్ని తప్పకుండా ఈసారి బీజేపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. సిట్టింగ్ స్థానంగా చెప్పుకుంటున్న కాంగ్రెస్‌కి మల్కాజిగిరిలో బేస్ లేదని హాట్ కామెంట్స్ చేశారు.
బీఆర్ఎస్, బీజేపీకి కనీస పోటీ కూడా ఇవ్వలేదని ఆయన అన్నారు. బీఆర్ఎస్‌ను ఇప్పటికే ప్రజలు పక్కనపెట్టారని.. పార్లమెంటు ఎన్నికల్లో వారికి ఓటు వేయడం వృధా అని ప్రజలు భావిస్తున్నారని ఈటెల చెప్పారు. ఇక కాంగ్రెస్‌కు ఓటేసినా ఒరిగేదేమీ లేదని.. బీజేపీకి ఓటు వేస్తే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు వస్తాయన్నారు. సో తప్పకుండా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుంచి అత్యధికంగా బీజేపీ సీట్లు సాధించి కేంద్రంకు సపోర్ట్‌గా ఉండి.. తెలంగాణ అభివృద్ధి కోసం నిలబడాలని ప్రజలని కోరారు.




