Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ బాధితులంతా ఒక్కటవ్వాలి.. ఆ నేతలకు రఘునందన్‌రావు పిలుపు!

ప్రస్తుతం తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహరం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. తీగ లాగితే డొంక కదిలినట్టు.. ఈ కేసులో ఎంతోమంది ఉన్నతాధికారులు, రాజకీయ నాయకుల పాత్ర ఉన్నట్టు రోజుకో వార్త వినిపిస్తోంది. అయితే ఏకంగా సీఎం రేవంత్ పై ట్యాపింగ్ జరిగిందని ఆరోపణలు రావడంతో కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది.

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ బాధితులంతా ఒక్కటవ్వాలి.. ఆ నేతలకు రఘునందన్‌రావు పిలుపు!
Phone Tapping Case
Follow us

|

Updated on: Mar 27, 2024 | 5:00 PM

ప్రస్తుతం తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహరం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. తీగ లాగితే డొంక కదిలినట్టు.. ఈ కేసులో ఎంతోమంది ఉన్నతాధికారులు, రాజకీయ నాయకుల పాత్ర ఉన్నట్టు రోజుకో వార్త వినిపిస్తోంది. అయితే ఏకంగా సీఎం రేవంత్ పై ట్యాపింగ్ జరిగిందని ఆరోపణలు రావడంతో కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ నేపథ్యంలో తాజాగా మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకులు రఘు నందన్ రావు రియాక్ట్ అయ్యారు.

ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై బీజేపీ నేత రఘునందన్‌రావు రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఈ కేసులో బీఆరఎస్ నాయకుల పాత్ర లేకుండా ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం సాధ్యం కాదన్నారాయన. దీనిపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని కోరారు రఘునందన్‌రావు. మునుగోడు ఉప ఎన్నిక సమయంలోనూ ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగిందని ఆరోపించారు రఘునందన్‌రావు. దీనిపై ప్రస్తుతం అధికారపార్టీలో ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, గడ్డం వివేక్‌ కూడా డీజీపీకి ఫిర్యాదు చేయాలని కోరారు. ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నేతలను కూడా విచారించాలని డిమాండ్ చేశారు. అప్పటి అధికార నాయకుల ప్రమేయం లేకుండా ట్యాపింగ్ ఎలా సాధ్యమని రఘునందన్ ప్రశ్నించారు. భద్రతమాదే, బాధ్యత మాదే అంటున్న పోలీసులు చర్యలు తీసుకోరా? అని రఘునందన్ రావు ప్రశ్నించారు.

కాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహరంపై రియాక్ట్ అయ్యారు. ఇవాళ తెలంగాణ భవన్ లో జరిగిన మల్కాజ్ గిరి నియోజకవర్గ నేతల సమావేశంలో ఈ వ్యవహరంపై స్పందించారు. ఒకరివో.. ఇద్దరివో ఫోన్ ట్యాప్ కావచ్చునని.. అంత మాత్రాన బీఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేయడం కరెక్ట్ కాదని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల హామీల అమలును పక్కకు పెట్టి ఫోన్ ట్యాపింగ్ వ్యవహరాన్ని అంతర్జాతీయ కుట్రగా మలిచే ప్రయత్నం చేస్తుందని, దమ్ముంటే విచారణ చేపట్టాలని కేటీఆర్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.