Watch Video: కంటతడి పెట్టిన కాంగ్రెస్ మహిళా నేత.. అసలు కారణం ఇదే..
సిద్దిపేట జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కంటతడి పెట్టారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశం నిర్వహించారు. అయితే ప్రెస్ మీట్ సమయంలో చాలా మంది కాంగ్రెస్ నాయకులు వేదికపై కూర్చున్నారు.
సిద్దిపేట జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కంటతడి పెట్టారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశం నిర్వహించారు. అయితే ప్రెస్ మీట్ సమయంలో చాలా మంది కాంగ్రెస్ నాయకులు వేదికపై కూర్చున్నారు. కానీ జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ముద్దం లక్ష్మీకి కుర్చీ వేయలేదు. దీంతో ప్రెస్ మీట్ అనంతరం ముద్దం లక్ష్మీ బాధపడుతూ కంటతడి పెట్టారు. పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు చేశామన్నారు. నేడు పార్టీ అధికారంలోకి రాగానే కొత్తగా చేరిన వారికి మర్యాదలు చేస్తూ.. తమకు మర్యాద ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. ఈ సందర్భంగా పార్టీ పెద్దల తీరుపై అసహనం వ్యక్తం చేశారు ముద్దం లక్ష్మీ.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

