AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మామూలోడు కాదు.. ఎస్ఐని తీసుకొస్తానని బైక్ తీసుకెళ్లాడు.. చివరకు ఏం జరిగిందో తెలుసా..

అది ఎప్పుడూ వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే ప్రాంతం.. అక్కడో మనిషి నిలబడి ఉన్నాడు.. అటు ఇటు వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయి. అటుగా వస్తున్న ఓ బుల్లెట్ వాలాను ఆయన ఇటు రావాలంటూ సైగ చేశాడు. అతను రహదారిపైనే తన బైక్ ను ఆపాడు.. అక్కడకు వెళ్లిన ఆ అగంతకుడు వారికి ఓ మాట చెప్పగానే బైక్ వాలా రోడ్డు పక్కకు వచ్చాడు.

మామూలోడు కాదు.. ఎస్ఐని తీసుకొస్తానని బైక్ తీసుకెళ్లాడు.. చివరకు ఏం జరిగిందో తెలుసా..
Bike Theft
G Sampath Kumar
| Edited By: |

Updated on: Sep 17, 2024 | 8:06 PM

Share

అది ఎప్పుడూ వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే ప్రాంతం.. అక్కడో మనిషి నిలబడి ఉన్నాడు.. అటు ఇటు వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయి. అటుగా వస్తున్న ఓ బుల్లెట్ వాలాను ఆయన ఇటు రావాలంటూ సైగ చేశాడు. అతను రహదారిపైనే తన బైక్ ను ఆపాడు.. అక్కడకు వెళ్లిన ఆ అగంతకుడు వారికి ఓ మాట చెప్పగానే బైక్ వాలా రోడ్డు పక్కకు వచ్చాడు. అగంతకుడు చెప్పిన మాటలు విన్న బైక్ వాలా.. అతనికి తన వాహనాన్ని అప్పగించాడు. తన ద్విచక్ర వాహనం పట్టుకెళ్లిన వ్యక్తి కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. చివరకు అనుమానం వచ్చి పోలీసుల దగ్గరకు వెళ్లగా.. అసలు విషయం తెలిసి లబోదిబోమన్నాడు.. చివరకు చేసేదేం లేక ఫిర్యాదు చేశాడు. ఈ షాకింగ్ ఘటన కరీంనగర్ నడి బొడ్డున జరిగింది.. ఈ ఘటన దొంగల అతి తెలివికి పరాకాష్టగా నిలిస్తే.. ఎస్సై పేరు చెప్పగానే వెనకా ముందు ఆలోచించకుండా తన వాహానాన్ని అప్పగించిన బైక్ వాలా తీరు విస్మయానికి గురిచేసింది.

శాస్త్రీ రోడ్‌లో..

కరీంనగర్ శాస్త్రీ రోడ్‌లోని మెడికల్ ఏజెన్సీలు ఉన్న ఓ వీధిలో రాత్రి 8 గంటల ప్రాంతంలో జరిగిన విచిత్ర దొంగతనం అందరిని ఆశ్చర్యపర్చింది. రద్దీగా ఉన్న ప్రాంతంలో రోడ్డు పక్కన నిలబడిన అగంతకుడు ప్రత్యేకంగా బుల్లెట్ వాహనంపై వెల్తున్న అతన్ని ఆపి రోడ్డు పక్కకు తీసుకెళ్లి ఎస్సైని తీసుకువచ్చేందుకు బైక్ ఇవ్వాలని అడిగి మరీ తీసుకెళ్లాడు. ట్రాఫిక్ కానిస్టేబుల్ ముసుగులో రాయల్ ఇన్ ఫీల్డ్ నంబర్ TS02EX7852 బైక్ ను తీసుకెళ్లిన అగంతకుడు ఎంతకీ తిరిగి రాకపోయే సరికి అనుమానం వచ్చిన బాధితుడు.. బొజ్జ శివం వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు రంగలోకి దిగి సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుని కోసం ఆరా తీసే పనిలో నిమగ్నం అయ్యారు.

ఎన్నోవాహనాల రాకపోకలు..

అయితే శివం వెల్తున్న క్రమంలో అతన్ని మాత్రమే ఆపి మరీ బైక్ అడిగి అగంతకుడు ఎత్తుకెళ్లిన తీరు విస్మయం కల్గిస్తోంది. బాధితుని నుండి బైక్ అడిగినప్పుడు ఆదే రోడ్డు మీదుగా ఇతర వాహనాలు చాలా వెళ్తున్నాయి. ప్రత్యేకండా అతన్నే ఎందుకు ఆపాల్సి వచ్చిందోనన్న అనుమానం వస్తే.. దొంగ చేతికి వాహనం ఇచ్చే అవకాశమే ఉండకపోయేదని పేర్కొంటున్నారు. అంతేకాకుండా పోలీసు యంత్రాంగానికి సరిపడా వాహనాలను ప్రభుత్వం సమకూర్చిన సంగతి తెలిసిందే. ఎస్సై ఆ ప్రాంతానికి చేరుకోవాలంటే పెట్రోలింగ్ కార్ కూడా ఉంటుంది.. అంతకి కావాలంటే.. బండి కోసం కానిస్టేబుళ్లను పిలిపించుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇలాంటి చిన్న లాజిక్ అర్ధం చేసుకోకుండా బైక్ ఇవ్వాలని అడగగానే అతనికి అప్పగించడం విచిత్రంగా ఉందంటూ పేర్కొంటున్నారు. మొత్తానికి బుల్లెట్ విలువ రూ. 90 వేల నుంచి లక్ష వరకు ఉంటుందని పేర్కొంటున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..