AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ganesh Laddu: పాత రికార్డులు బ్రేక్.. కోట్లు కుమ్మరించి మరీ గణేష్ లడ్డూలు ఎందుకు కొంటున్నారు?

ప్రతియేటా జరిగే గణేష్ ఉత్సవాల్లో అందరి ఫోకస్ లడ్డూ వేలంపై కూడా ఉంటుంది. ఎప్పటిలానే గణేష్ లడ్డూలను దక్కించుకునేందుకు ఈసారి కూడా వేలంలో పోటాపోటీ నెలకొంది. నెవ్వర్ బిఫోర్ అనేలా.. కోట్లు కుమ్మరించి కొంగు బంగారంగా నిలిచే గణనాథుని లడ్డూలను దక్కించుకున్నారు భక్తులు.

Ganesh Laddu: పాత రికార్డులు బ్రేక్.. కోట్లు కుమ్మరించి మరీ గణేష్ లడ్డూలు ఎందుకు కొంటున్నారు?
Ganesh Laddu Auction
Janardhan Veluru
|

Updated on: Sep 17, 2024 | 10:43 PM

Share

ప్రతియేటా జరిగే గణేష్ ఉత్సవాల్లో అందరి ఫోకస్ లడ్డూ వేలంపై కూడా ఉంటుంది. ఎప్పటిలానే గణేష్ లడ్డూలను దక్కించుకునేందుకు ఈసారి కూడా వేలంలో పోటాపోటీ నెలకొంది. నెవ్వర్ బిఫోర్ అనేలా.. కోట్లు కుమ్మరించి కొంగు బంగారంగా నిలిచే గణనాథుని లడ్డూలను దక్కించుకున్నారు భక్తులు. చాలా చోట్ల భక్తుల పాలిట కొంగు బంగారంగా నిలిచే లడ్డూ ప్రసాదం సరికొత్త రికార్డులు నమోదు చేశాయి. కేజీల బరువుండే గణేష్ లడ్డూను దక్కించుకుంటే టన్నుల కొద్దీ అదృష్టం తమ తలుపు తడుతుందన్న భక్తుల నమ్మకమే దీనికి కారణం. దీంతో తగ్గేదే లే అంటూ గణేష్ లడ్డూ వేలం పాటలో భక్తుల మధ్య గట్టిపోటీ నెలకొంది. రికార్డులు తిరగరాసిన బాలాపూర్ లడ్డూ.. బాలాపూర్‌ గణేష్‌ అంటే అందరికీ గుర్తొచ్చేది లడ్డూ వేలం పాటే. ఇక్కడ విగ్రహం ఎత్తు కంటే.. బాలాపూర్‌ గణేషుడి చేతిలో ఉంటే లడ్డూపైనే అందరి ఫోకస్‌ ఉంటుంది. ఎందుకంటే, వేలం పాటలో ప్రతియేటా బాలాపూర్ లడ్డూ పాత రికార్డులను చెరిపేస్తూ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ముందుగా ఊహించినట్టే బాలాపూర్‌ గణేష్‌ లడ్డూకు ఈ సారి కూడా వేలంపాటలో పట్ట పగ్గాల్లేకుండా పోయింది. మరోసారి రికార్డు ధర పలికింది. 30వ ఏట జరిగిన బాలాపూర్‌ లడ్డూ వేలం పాటలో ఏకంగా రూ. 30 లక్షలు క్రాస్‌ చేసింది. రూ. 30,01,000 లకు కొలను శంకర్‌రెడ్డి బాలాపూర్ లడ్డూను దక్కించుకున్నారు. గతేడాది కంటే రూ.3,01,000 అధికంగా పలికింది బాలాపూర్‌ లడ్డూ. గత...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి