AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raja Yogam: అనుకూలంగా కీలక గ్రహాలు.. ఆ రాశుల వారికి గృహ, వాహన యోగాలు పక్కా..!

కన్యా రాశిలో రవి, శుక్ర, కేతువులు సంచరిస్తుండడం, దానిని వృషభ రాశి నుంచి గురువు, మిథున రాశి నుంచి కుజుడు వీక్షించడం వల్ల ఆరు రాశుల వారికి దశ తిరగబోతోంది. ఈ కాంబినేషన్ వల్ల వచ్చే నెల 16లోగా కొన్ని రాశుల వారి జీవితం అనేక సానుకూల మలుపులు తిరిగే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో రాజయోగాలు పడతాయి. ఆదాయం విశేషంగా అభివృద్ధి చెంది మానసిక ప్రశాంతత లభిస్తుంది.

Raja Yogam: అనుకూలంగా కీలక గ్రహాలు.. ఆ రాశుల వారికి గృహ, వాహన యోగాలు పక్కా..!
Raja Yoga
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 17, 2024 | 5:35 PM

Share

కన్యా రాశిలో రవి, శుక్ర, కేతువులు సంచరిస్తుండడం, దానిని వృషభ రాశి నుంచి గురువు, మిథున రాశి నుంచి కుజుడు వీక్షించడం వల్ల ఆరు రాశుల వారికి దశ తిరగబోతోంది. మేషం, వృషభం, మిథునం, సింహం, ధనుస్సు, మకర రాశులకు ఈ కాంబినేషన్ వల్ల వచ్చే నెల 16లోగా జీవితం అనేక సానుకూల మలుపులు తిరిగే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో రాజయోగాలు పడతాయి. ఆదాయం విశేషంగా అభివృద్ధి చెంది మానసిక ప్రశాంతత లభిస్తుంది. గృహ, వాహన యోగాలు పట్టడంతో పాటు ఆస్తిపాస్తులు లభించే అవకాశం కూడా ఉంది.

  1. మేషం: ఈ రాశివారికి అనేక విధాలుగా శుభ యోగాలు, అదృష్టాలు పట్టే అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభంతో పాటు ఆకస్మిక అధికార యోగ సూచనలు కూడా ఉన్నాయి. రావలసిన సొమ్ము, రాదనుకుని వదిలేసుకున్న సొమ్ము, బాకీలు, బకాయిలు చేతికి అందడం జరుగుతుంది. తండ్రి వైపు నుంచి ఊహించని ధన లాభం కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలు రాబడిపరంగా ఎంతో పురో గతి చెందుతాయి. ఆర్థిక సమస్యలన్నీ చాలావరకు పరిష్కారమై సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి.
  2. వృషభం: ఈ రాశివారికి అంచనాలకు మించి ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి దాదాపు పూర్తిగా బయటపడతారు. ఉద్యోగంలోనే కాక, సామాజికంగా కూడా ప్రతిభకు, సమర్థతకు మంచి గుర్తింపు లభిస్తుంది. అత్యున్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు వృద్ధి చెందు తాయి. దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. అనారోగ్య సమస్యల నుంచి విముక్తి లభి స్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది. స్త్రీ, పురుషులకు పెళ్లి యోగం కలుగుతుంది.
  3. మిథునం: ఈ రాశివారికి తప్పకుండా గృహ యోగం పడుతుంది. ఆస్తిపాస్తుల సమస్యలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. ఆస్తుల విలువ బాగా పెరుగుతుంది. అన్ని వైపుల నుంచి ఆదాయం వృద్ధి చెందుతుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో వివాహం నిశ్చయం అవుతుంది. నిరు ద్యోగులకు కలలో కూడా ఊహించని ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగులకు ఉద్యోగంలో స్థిరత్వం లభి స్తుంది. పదోన్నతికి కూడా అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు నష్టాల నుంచి బయటపడతాయి.
  4. సింహం: ఈ రాశివారికి అనేక విధాలుగా కలిసి వస్తుంది. సిరిసంపదలు వృద్ది చెందే అవకాశం ఉంది. ఉద్యో గంలో జీతభత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతాయి. ఆర్థిక సమస్యలు, ఒత్తిళ్ల నుంచి పూర్తిగా బయటపడడం జరుగుతుంది. ఉద్యోగంలో ఉన్నత స్థానాలను అలంకరిస్తారు. నిరుద్యోగుల విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ రాశివారు ప్రతి విషయంలోనూ, ప్రతి ప్రయత్నంలోనూ విజయాలు సాధిస్తారు. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి.
  5. ధనుస్సు: ఈ రాశికి వృత్తి, ఉద్యోగాల్లోనే కాకుండా సామాజికంగా కూడా హోదా, స్థాయి పెరుగుతాయి. ప్రము ఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. ఆర్థికంగా అంచెలంచెలుగా ఎదిగిపోతారు. సంపన్ను లతో సంబంధాలు పెరుగుతాయి. ఉద్యోగంలో సీనియర్లను దాటిపోతారు. వృత్తి, వ్యాపారాల్లో ఊహిం చని విధంగా డిమాండ్ పెరుగుతుంది. వీరు చేపట్టే ఎటువంటి ప్రయత్నమైనా విజయవంతం అవుతుంది. కుటుంబంలో శుభ కార్యాలు జరుగుతాయి. ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది.
  6. మకరం: ఈ రాశివారికి మహా భాగ్య యోగం పట్టే సూచనలున్నాయి. అనేక విధాలుగా అదృష్టం కలిసి వస్తుంది. ఆశించిన శుభవార్తలు వింటారు. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుం టాయి. ఆర్థికంగా బాగా శక్తిమంతం అవుతారు. సంపన్నులు లేదా వ్యాపార కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది.

బ్లూ లైట్ గ్లాసెస్ వాడుతున్నారా? ఇది కచ్చితంగా తెలుసుకోండి..
బ్లూ లైట్ గ్లాసెస్ వాడుతున్నారా? ఇది కచ్చితంగా తెలుసుకోండి..
మేడారం కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు.. ఎక్కడినుంచి ఎక్కడికంటే..
మేడారం కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు.. ఎక్కడినుంచి ఎక్కడికంటే..
పిల్లల్లో ఫిట్స్ వ్యాధికి ఆ కూరగాయలే కారణమా?
పిల్లల్లో ఫిట్స్ వ్యాధికి ఆ కూరగాయలే కారణమా?
ట్రిప్‌కు వెళ్లి అనుకోని చిక్కుల్లో.. OTTలో మిస్టరీ థ్రిల్లర్
ట్రిప్‌కు వెళ్లి అనుకోని చిక్కుల్లో.. OTTలో మిస్టరీ థ్రిల్లర్
వందే భారత్ స్లీపర్ రైళ్లపై బిగ్ అప్డేట్.. ప్రారంభం ఎప్పుడంటే..?
వందే భారత్ స్లీపర్ రైళ్లపై బిగ్ అప్డేట్.. ప్రారంభం ఎప్పుడంటే..?
కుబేరుడి చూపు మీపై పడాలంటే ఉత్తర దిశలో ఇవి ఉండాల్సిందే..
కుబేరుడి చూపు మీపై పడాలంటే ఉత్తర దిశలో ఇవి ఉండాల్సిందే..
ఉన్నావ్‌ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
ఉన్నావ్‌ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
ఏపీలోని మందుబాబులకు శుభవార్త.. పనివేళల్లో మార్పులు
ఏపీలోని మందుబాబులకు శుభవార్త.. పనివేళల్లో మార్పులు
ఈ ఒక్క స్మార్ట్ జాకెట్ ఉంటే చాలు.. చలి గజగజ వణకాల్సిందే!
ఈ ఒక్క స్మార్ట్ జాకెట్ ఉంటే చాలు.. చలి గజగజ వణకాల్సిందే!
ఆడబిడ్డకు జన్మనిచ్చి తల్లి మృతి.. ఇంటికి తీసుకెళ్తుండగా శిశువు..
ఆడబిడ్డకు జన్మనిచ్చి తల్లి మృతి.. ఇంటికి తీసుకెళ్తుండగా శిశువు..