చంద్ర గ్రహణం రోజున కొన్ని పరిహారాలు చేయడం శుభప్రదం. గ్రహణం రోజు ఇంటికి సమీపంలోని శివాలయానికి వెళ్లి పాలతో రుద్రాభిషేకం చేస్తే మంచిది. అంతే కాకుండా చంద్రబింబం, తెల్లటి గుడ్డ, బియ్యం లేదా వడ్లు, కంది పప్పు వంటి వాటిని తమలపాకు, అరటిపండు, కొబ్బరికాయలతో పాటు దానంగా ఇవ్వాలి. అనంతరం శివాష్టోత్తరం, చంద్రాష్టోత్తరం జపించడం శుభప్రదం.