AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణ-ఛత్తీస్ ఘడ్ బార్డర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. 22 మంది మావోయిస్టులు మృతి

కర్రెగుట్ట లో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది..గత 16 రోజులుగా ఆపరేషన్ కర్రెగుట్ట కొనసాగుతోంది.. భద్రతా బలగాలు ఆపరేషన్ లో పురోగతి సాధించాయి..ఛత్తీస్ ఘడ్ బీజాపూర్ జిల్లా కర్రెగుట్టల్లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది..ఎన్ కౌంటర్ లో 22 మంది మావోయిస్టులు మృతి చెందారు..ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలు పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య భారీగా ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి.

తెలంగాణ-ఛత్తీస్ ఘడ్ బార్డర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. 22 మంది మావోయిస్టులు మృతి
Encounter
N Narayana Rao
| Edited By: Jyothi Gadda|

Updated on: May 07, 2025 | 12:08 PM

Share

కర్రెగుట్ట ల్లో ఆపరేషన్ ను సీఆర్పీఎఫ్ ఐజి రాజేష్ అగర్వాల్ , బస్తర్ ఐజీ సుందర్ రాజ్ ,ఛత్తీస్ ఘడ్ ఏడిజి వివేకంద సిన్హా ఎప్పటి కప్పుడు పర్యవేక్షిస్తున్నారు..ఈ 15 రోజుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి ..కొన్ని బంకర్లు స్వాధీనం చేసుకోవడం మినహా..పెద్దగా పురోగతి లేదు.. నలువైపుల నుంచి గుట్టలను దాదాపు 24 వేలమంది బలగాలు చుట్టుముట్టాయి. వేసవి కావడంతో..విపరీతమైన వేడి, ఉక్కపోత తో దండకారణ్యంలో మనుషులు వెళ్ళడానికి అవకాశం లేని చిమ్మ చీకట్లు. పదుల సంఖ్యలో జవాన్లు అస్వస్థత కు గురవుతున్నారు..

అయినా పట్టువదలకుండా..మూడు కొండలు స్వాధీనం చేసుకున్నాయి. దాదాపు 250 ఐ ఈడి బాంబులు గుర్తించి నిర్వీర్యం చేశాయి భద్రతా బలగాలు. 15 మందుపాతరలు పేలాయి..ఇప్పటి వరకు ఐదుగురు జవాన్లు గాయాలు అయ్యాయి..మొన్నటి నుంచి వర్షాలు కురిసిన నేపధ్యంలో అడవులు చిగురించాయి..లోపల కొండలు నుంచి జలపాతాలు ప్రవహిస్తున్నాయి..మనిషి కాలు పెట్టలేని విధంగా ఊబులు ఉన్నట్లు తెలుస్తోంది..సాయత్రం 3 కాగానే చిమ్మ చీకట్లు ఉంటున్నాయి..అంతేకాకుండా విష సర్పాలు, పురుగులు సంచరిస్తున్నాయి..ఇవన్నీ ఆపరేషన్ కు ప్రతికూలంగా మారాయి..ఒకవిధంగా జవాన్లకు ఆపరేషన్ కత్తిమీద సాములా మారింది..ఎప్పటి కప్పుడు ఉన్నత అధికారుల డైరెక్షన్ లో డిఫెన్స్ హెలికాప్టర్లు, డ్రోన్స్, శాటిలైట్ మ్యాప్స్ ద్వారా మావోయిస్టులు సొరంగాలు ,స్థావరాలు గుర్తిస్తూ ముందుకు వెళుతున్నాయి..

కొండల్లో రెండు బేస్ క్యాంపు లు ఏర్పాటు చేసుకుని ఆయుధాలు, భద్రతా బలగాలకు కావలసిన వస్తువులు, నిత్యావసర వస్తువులు హెలికాప్టర్ల ద్వారా సమకూర్చుకున్నారు..మావోయిస్టులు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేస్తున్నా చర్చల ప్రసక్తే లేదని కేంద్ర ప్రభుత్వం, ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. మరింత దూకుడుగా ఆపరేషన్ కొనసాగించే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..