AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Operation Sindoor: ఇది నా భర్త త్యాగానికి నిజమైన గౌరవం.. ఆత్మకు శాంతి..! శుభం ద్వివేది భార్య భావోద్వేగం..

26 మంది అమాయక ప్రజల ప్రాణాలను బలిగొన్న పహల్గాం ఉగ్రవాద దాడికి భారతదేశం ప్రతీకారం తీర్చుకుంది. పహల్గాం ఉగ్రదాడిలో ఉత్తరప్రదేశ్ లోని లక్నోకు చెందిన శుభం ద్వివేది ప్రాణాలు కోల్పోయారు. ఆయన భార్య ఐశన్య ద్వివేది ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. శుభం ద్వివేది తండ్రి సంజయ్ ద్వివేది మాట్లాడుతూ, భారత సైన్యం తీసుకున్న చర్య దేశ ప్రభుత్వంపై నమ్మకాన్ని కలిగించిందని అన్నారు.

Operation Sindoor: ఇది నా భర్త త్యాగానికి నిజమైన గౌరవం.. ఆత్మకు శాంతి..! శుభం ద్వివేది భార్య భావోద్వేగం..
Ashanya Dwivedi
Jyothi Gadda
|

Updated on: May 07, 2025 | 10:19 AM

Share

పహల్‌గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన శుభం ద్వివేది భార్య ఐశన్య ద్వివేది భావోద్వేగంగా స్పందించారు. పాక్‌లోని ఉగ్రస్థావరాలపై జరిగిన దాడి ఓ సాధారణ ప్రతీకారం కాదని, అది తన భర్తకు అర్పించిన ఘన నివాళి అని అన్నారు. ప్రధాని మోదీ తమ నమ్మకాన్ని నిలబెట్టుకున్నారని కొనియాడారు. ‘ఇది నా భర్త త్యాగానికి నిజమైన గౌరవం. ఆయన ఆత్మ ఇప్పుడు శాంతిస్తుందనే నమ్మకం ఉందన్నారు. నా భర్త మరణానికి ప్రతీకారం తీర్చుకున్నందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు అంటూ భారత సైన్యాన్ని ప్రశంసించారు. పహల్గాం ఉగ్రదాడిలో ఉత్తరప్రదేశ్ లోని లక్నోకు చెందిన శుభం ద్వివేది ప్రాణాలు కోల్పోయారు. ఆయన భార్య ఐశన్య ద్వివేది ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు.

శుభం ద్వివేది తండ్రి సంజయ్ ద్వివేది మాట్లాడుతూ, భారత సైన్యం తీసుకున్న చర్య దేశ ప్రభుత్వంపై నమ్మకాన్ని కలిగించిందని అన్నారు. భారత సైన్యానికి సెల్యూట్ చేస్తున్నాము అంటూ చెప్పారు. దేశ ప్రజల బాధల్ని విన్న ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలియజేశారు.. పాకిస్తాన్‌లో విజృంభిస్తున్న ఉగ్రవాదాన్ని భారత సైన్యం ఎలా నాశనం చేసిందో, దానికి తమంతా మన సైన్యానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను… ఈ వార్త విన్నప్పటి నుండి మా కుటుంబం మొత్తం ప్రశాంతంగా ఉందని శుభం తండ్రి అన్నారు. శుభం ద్వివేది బంధువు మనోజ్ ద్వివేది మాట్లాడుతూ, బాధితులకు ఎట్టకేలకు న్యాయం జరిగిందని అన్నారు.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

26 మంది అమాయక ప్రజల ప్రాణాలను బలిగొన్న పహల్గాం ఉగ్రవాద దాడికి భారతదేశం ప్రతీకారం తీర్చుకుంది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత భారత ఆపరేషన్ సింధూర్‌ పేరిట పాక్‌ ఉగ్రమూకలపై విరుచుకుపడింది. ఈ ఆపరేషన్ లో భాగంగా పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని 9 ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడి చేసింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ట్రంప్ ఆరోగ్యంపై నెట్టింట వైరల్.. స్పందించిన వైట్ హౌస్..నిజమేంటి?
ట్రంప్ ఆరోగ్యంపై నెట్టింట వైరల్.. స్పందించిన వైట్ హౌస్..నిజమేంటి?
చెన్నై హ్యాట్రిక్‌ ఓటమి.. అగ్రస్థానానికి ఆర్‌సీబీ
చెన్నై హ్యాట్రిక్‌ ఓటమి.. అగ్రస్థానానికి ఆర్‌సీబీ
గాడిదను తేలిగ్గా తీసుకోవద్దు.. అవి మనిషికి నేర్పే 5 జీవిత పాఠాలు.
గాడిదను తేలిగ్గా తీసుకోవద్దు.. అవి మనిషికి నేర్పే 5 జీవిత పాఠాలు.
చిలుకకు ‘రామ చిలుక’ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా..?
చిలుకకు ‘రామ చిలుక’ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా..?
పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా
పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా
15 ఏళ్లకే ప్రపంచ రికార్డులో చేరిన వైభవ్.. అదేంటో తెలుసా?
15 ఏళ్లకే ప్రపంచ రికార్డులో చేరిన వైభవ్.. అదేంటో తెలుసా?
టిమ్ డేవిడ్, పాటిదార్ ఊచకోత.. చెన్నై ముందు కొండంత టార్గెట్..!
టిమ్ డేవిడ్, పాటిదార్ ఊచకోత.. చెన్నై ముందు కొండంత టార్గెట్..!
వాట్సప్‌, ఫేస్‌బుక్‌ DP ఫొటో.. మీరెలాంటి వ్యక్తో చెప్పేస్తుంది..!
వాట్సప్‌, ఫేస్‌బుక్‌ DP ఫొటో.. మీరెలాంటి వ్యక్తో చెప్పేస్తుంది..!
ఒకటి రెండు రోజులు కాదు.. అక్కడ ఏకంగా 37 రోజులుగా ఇంటర్నెట్‌ బంద్‌
ఒకటి రెండు రోజులు కాదు.. అక్కడ ఏకంగా 37 రోజులుగా ఇంటర్నెట్‌ బంద్‌
ఏంటీ లీటర్ కొబ్బరి నీళ్లు రూ.180 హా వైరల్ అవుతున్న 'బ్లాక్ బోర్డ్
ఏంటీ లీటర్ కొబ్బరి నీళ్లు రూ.180 హా వైరల్ అవుతున్న 'బ్లాక్ బోర్డ్