Telangana: వలసలతోనే అధికారం నిలబడుతుందా? జంపింగ్స్‌లో అందరిదీ గురవింద సామెతేనా?

తెలంగాణలో ముచ్చటగా మూడో అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడా రాజకీయవలసలకు గేట్లు తెరుచుకున్నాయి. నాడు బీఆర్ఎస్‌లోకి వరద కొట్టుకురాగా.. ఇప్పుడు కాంగ్రెస్‌ వైపు కొట్టుకొస్తోంది. నాడు తప్పన్నవాళ్లే ఇప్పుడు తప్పదంటున్నారు.. అప్పుడు రైట్‌ అన్నవాళ్లు ఇప్పుడు యాక్షన్‌ ప్లీజ్‌ అంటూ స్పీకర్‌ వద్దకు పరుగులు తీస్తున్నారు.

Telangana: వలసలతోనే అధికారం నిలబడుతుందా? జంపింగ్స్‌లో అందరిదీ గురవింద సామెతేనా?
Big News Big Debate
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 18, 2024 | 6:59 PM

వలసల వరద కూడా మొదలైంది.. 2014లో హైదరాబాద్‌లోని తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ రూపంలో వలసలకు బీఆర్ఎస్‌ శ్రీకారం చుడితే.. ఇప్పుడు అదే హైదరాబాద్‌ మహానగరంలోని ఖైరతాబాద్‌ నుంచి దానం నాగేందర్‌ రూపంలో కాంగ్రెస్‌లోకి జంపింగ్స్‌ మొదలయ్యాయి..Spot దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్‌ నేతలు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. జంపింగ్స్‌ విషయంలో బీఆర్‌ఎస్‌ తప్పు చేస్తే మీరు కూడా అదే పొరపాటు చేస్తారా అంటూ ప్రశ్నించారు మాజీ ఎంపీ వినోద్‌. కోర్టు తీర్పులు, ప్రజాప్రాతినిధ్య చట్టాలకు అనుగుణంగా స్పీకర్‌ వెంటనే నిర్ణయం తీసుకోవాలన్నారు బీఆర్ఎస్‌ నేతలు.

పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ తీరు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు గా ఉందంటోంది కాంగ్రెస్‌. 10 యేళ్ళ పాటు విచ్చలవిడిగా ప్రోత్సహించింది బీఆర్ఎస్‌ కాదా అని ప్రశ్నిస్తోంది. బీఆర్ఎస్, బీజేపీ కుట్రలు బలి కావడానికి సిద్ధంగా లేమన్నారు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు.

మరోవైపు బిఎస్పీ పార్టీకి రాజీనామా చేసిన ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ బీఆర్‌ఎస్‌లో చేరారు. కాంగ్రెస్‌ ఆఫర్ నిజమే అయినా… ఎవరో గేట్లు తెరిస్తే చేరుతున్న గొర్రెల మందలో ఒక్కడిగా ఉండలేనంటూ కాంగ్రెస్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ ఐపీఎస్‌. ఇక నాడు కేసీఆర్‌ చేసిన తప్పే మళ్లీ రేవంత్‌ చేస్తున్నారని మండిపడుతోంది బీజేపీ.

ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకోవడానికే వలసలను ప్రోత్సహిస్తున్నామని నాడు బీఆర్ఎస్‌ చెప్పింది.. ఇప్పుడు కాంగ్రెస్‌ కూడా అదే నినాదంతో ఫిరాయింపులకు శ్రీకారం చుట్టింది. మరి పార్లమెంట్‌లో ఈ వలసల ప్రభావం ఉంటుందా?  అన్నది ఇంట్రస్టింగ్ టాపిక్.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ