AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సికింద్రాబాద్‌ నుంచి ప్రత్యేక రైలు.. ఐదు జ్యోతిర్లింగాలను కలుపుతూ భారత్‌ గౌరవ్‌ యాత్ర!

ఇండియన్ రైల్వేస్ ఆగస్టు 16 నుండి సికింద్రాబాద్ నుండి భారత్ గౌరవ్ పేరుతో ప్రత్యేక పర్యాటక రైలును ప్రారంభించింది. ఈ 9-రోజుల యాత్రలో ఐదు జ్యోతిర్లింగాలను దర్శించవచ్చు. స్లీపర్, 3AC, 2AC క్యాటగిరీల టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయి. ప్యాకేజీలో భోజనం, వసతి, రవాణా సౌకర్యాలు కూడా ఉన్నాయి.

సికింద్రాబాద్‌ నుంచి ప్రత్యేక రైలు.. ఐదు జ్యోతిర్లింగాలను కలుపుతూ భారత్‌ గౌరవ్‌ యాత్ర!
Train
SN Pasha
|

Updated on: Aug 05, 2025 | 5:57 PM

Share

భారత్ గౌరవ్ పేరుతో ఇండియన్‌ రైల్వేస్‌ ప్రత్యేక పర్యాటక రైలును ప్రారంభించింది. ఆగస్టు 16 నుంచి ‘భారత్ గౌరవ్’ ప్రత్యేక పర్యాటక రైలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరుతుంది. ఈ రైలులో పంచ జ్యోతిర్లింగ దర్శన యాత్ర (8 రాత్రులు / 9 రోజులు) చేయవచ్చు. మహాకాళేశ్వర్, ఓంకారేశ్వర్, త్రయంబకేశ్వర్, భీమశంకర్, గృష్ణేశ్వర్‌లను కలుపుతూ ఈ యాత్ర సాగుతోంది.

రైలు బయలుదేరు సమయం.. మధ్యాహ్నం 2:00 గంటలకు సికింద్రాబాద్ నుంచి, కామారెడ్డి, నిజామాబాద్, ధర్మాబాద్, ముద్కేడ్, నాందేడ్, పూర్ణా మీదుగ ఉజ్జయినికి ప్రయాణం కొనసాగుతుంది. టికెట్ ధరలు ఇలా ఉన్నాయి.. స్లీపర్‌ రూ.14,700, 3 AC రూ.22,900, 2 AC రూ.29,900లుగా ఉన్నాయి. ప్యాకేజీలో రోజుకు మూడు భోజనాలు, వసతి, పర్యాటక రవాణా సౌకర్యాలు, ప్రతి బోగీలో IRCTC సిబ్బంది అందుబాటులో ఉంటారు. ఈ ప్రత్యేక రైలు గురించి మరింత సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్, ఫోన్ నంబర్లు: 97013 60701, 92810 30740, 92810 30750, 92810 30711 సంప్రదించవచ్చు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి