Ganesh Immersion 2022: హైదరాబద్‌లో వినాయకుడి నిమజ్జన ఏర్పాట్లపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సంతృప్తి వ్యక్తం చేసింది. నిమజ్జనానికి ఏర్పాట్లు చేయాలన్నదే తమ ఆందోళన అంటున్న సమితి సభ్యులు.. ఆలస్యంగానైనా ఏర్పాట్లు పూర్తి చేశారంటూ ప్రభుత్వాన్ని అభినందించారు. ఉత్సవ సమితిలో అన్ని పార్టీల సభ్యులు ఉన్నారని స్పష్టం చేశారు. ఉత్సవాలు ఘనంగా నిర్వహించడమే తమ అభిమతమని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంత రావు వివరించారు.
ఇదిలాఉండగా, భాగ్యనగరంలో ఎటు చూసినా గణనాథుల సందడే నెలకొంది. గణపతి బప్పా మోరియా.. బై బై గణేషా నామస్మరణతో వీథులన్నీ మార్మోగుతున్నాయి. మండపాల్లో విశేష పూజలందుకున్న గణనాథులు.. ట్యాంక్‌బండ్‌వైపు కదులుతున్నాయి. ఎప్పటి లాగానే గణేష్ నిమజ్జనానికి సంబంధించి హైదరాబాద్ ట్యాంక్ బండ్‌పై భారీగా ఏర్పాట్లు చేశారు. బాలాపూర్ గణేశుడిని కూడా హైదరాబాద్ ట్యాంక్ బండ్ లోనే నిమజ్జనం చేయనున్నారు. ఇందుకోసం ట్యాంక్ బండ్ పై 8 క్రేన్లు, ట్యాంక్ బండ్ చుట్టూ 22 క్రేన్‌లను సిద్ధంగా ఉంచారు. ఇవికాక ఎన్టీఆర్ మార్గ్‌లో మరో 9 క్రేన్లు, పీపుల్స్ ప్లాజాలో 3 క్రేన్లు, రెండు బేబీ పాండ్ల వద్ద 2 క్రేన్లు ఏర్పాటు చేశారు.
రూట్ మ్యాప్ విడుదల..
గణేశ్ నిమజ్జనానికి సంబంధించిన రూట్ మ్యాప్‌ను హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు విడుదల చేశారు. ఏయే రూట్ల నుంచి విగ్రహాలను ట్యాంక్ బండ్ వైపు తీసుకురావాలనే దానిపై ఈ రూట్ మ్యాప్ ద్వారా స్పష్టత ఇచ్చారు.
In exercise of the powers conferred upon me under section 21 (1) (b) of Hyderabad City Police Act, I, C.V. Anand, I.P.S., Commissioner of Police, Hyderabad do hereby notify for the information of the general public that in order to relieve congestion https://t.co/n4cztpYOQ9 pic.twitter.com/TJU4sQ3GmJ
— Hyderabad City Police (@hydcitypolice) September 7, 2022
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..